ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగంలోకి దిగారు . తమ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తూ, సహాయ పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న ప్రజలను పరామర్శిస్తున్నారు . సహాయక కేంద్రాల్లోని  సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు . వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసానిస్తున్నారు . ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం వరద బాధితులను ఆదుకునేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే .


సోమవారం ఇబ్రహీంపట్నంలోని ముంపు ప్రాంతాలలో వైసీపీ నాయకులు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి పీవీపీ  పర్యటించారు. పెర్రీ సమీపంలో వరద నీట మునిగి ప్రాంతాలను పరిశీలించిన ఆయన,  అక్కడి వరద  భాదితులతో మాట్లాడారు. వారికున్న సమస్యలను అడిగితెలుసుకున్నారు... ఎమ్మార్వో మదన్ మోహన్ ను పిలిపించి వరదనీటిలో ఇబ్బందులు పడుతున్న భాదితులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా నీటి తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఎమ్మార్వోను కోరారు .  అక్కడ నుంచి పునరావాస కేంద్రానికి చేరుకుని అక్కడ ఉంటున్న చినలంక, పెదలంక గ్రామాలకు చెందిన వరద భాదితులతో మాట్లాడారు. పునరావాస కేంద్రంలో  సదుపాయాలపై పీవీపీ ఆరా తీయగా , అన్నీ సదుపాయాలు  బాగున్నాయని వారు ఆయనకు  వివరించారు.


 వరద వచ్చిన ప్రతీసారి తమ గ్రామాలు మునిగిపోతున్నాయని, తమకు  ప్రత్యామ్నాయంగా పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరారు.  మన ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి అయ్యారని ...  ఖచ్చితంగా మన  సమస్యలకు పరిష్కారం లభిస్తోందని,  అందరూ ధైర్యంగా ఉండాలని పీవీపీ అన్నారు.  స్ధానిక ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అందుబాటులో లేకపోవడంతో ముంపు ప్రాంతాలలో పీవీపీ వెంట స్ధానిక వైసీపీ నాయకులు శివారెడ్డి మోహన రావు, మధుబాబు, కోటేశ్వరరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: