విపత్తు సమయంలో మన సేనలు ఎటువంటి సాహసాలు చేస్తున్నారో చెప్పటానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఇద్దరు పౌరులైన తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించి వాయుసేన వారిని రక్షించడం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాళ్లోకి వెళ్తే మొన్నటి దాకా దక్షణ భారత దేశం మొత్తం వరదలలో చిక్కుకుపోయింది.

ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టి పరిస్తితులు యధాస్థానానికి వస్తున్నాయి. ఇప్పుడు వరదల తాకిడి ఉత్తర భారతదేశం వంతు అయ్యింది. జమ్మూలో వరదలు ముంచెత్తున్నాయి.వరుసగా కురుస్తున్న వర్షాలకు నదులన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.తావీ నదిలో నిర్మాణ స్థలంలో బ్రిడ్జిలో కొందరు కార్మికులు చిక్కుకున్నారు. దీంతో ఎన్డీఆర్ ఎఫ్ భారత ఎయిర్ ఫోర్స్ బలగాలు వారు అద్భుతంగా రక్షించారు. మొత్తం ముగ్గురు కార్మికులలో ఒకరు కొట్టు కుపోగా ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. వారికి అద్భుత రీతిలో భారత ఎయిర్ ఫోర్స్ రక్షించింది.

కైలాసంలో పుట్టి తావీనది జమ్మూలో ఉధంపూర్ ద్వారా ప్రవహించి చీనాబ్ నదిలో కలుస్తుంది. ఈ నేపథ్యం లో జమ్ములో నిర్మాణంలో ఉన్న ఈ బ్రిడ్జి పై కూలీలు ప్రతి రోజూ పనిచేస్తున్నారు. ఉత్తరాఖండ్ లో కురుస్తున్న వర్షాలకు తావి నదికి వరద నీరు పోటెత్తింది దీనితో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. జమ్మూలోని తావి నదిపై కడుతున్న డ్యాం పై దాని ప్రభావం పడింది.

ఇక్కడ పని చేస్తున్న కొందరు కార్మికులు ఒక్క సారిగా పోటెత్తిన వరదతో నిర్మాణంలోను డ్యాంపైనే ఉండిపోయారు. బయటపడేందుకు వారికి సరైన మార్గం లేకపోవటంతో అక్కడే పడిగాపులు పడ్డారు. దీంతో సమాచారం అందుకున్న భారత వాయుసేన ఆగమేఘాలపై అక్కడి కి చేరుకుంది. తొలుత కింద దిగటానికి ప్రయత్నించిన సమయంలో నిచ్చిన తాడు తెగిపోయింది. దీంతో వెనక్కి వెళ్ళిపోయింది హెలికాప్టర్ అంత కన్నా ముందే ఒక కార్మికుడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

కొద్ది సేపటి తర్వాత మరోసారి వాయుసేన హెలికాప్టర్లూ అక్కడికి చేరుకుంది. ఈ సారి కార్మికుడు ఉన్న స్థలంలో ల్యాండయ్యారు.తాడు సాయంతో కిందకు దిగిన వాయుసేన సైనికుడు అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులకు తనతో తెచ్చుకున్న సేఫ్టీ గ్రిప్ ను కట్టాడు. ఆ తరువాత వారికి తాడు ఎలా పట్టుకోవాలి చెప్పాడు. భయపడకుండా తాడును పట్టు కుంటే త్వరగా బయటపడొచ్చు అంటూ వారిలో ధైర్యాన్ని నింపాడు.

ఆ తర్వాత తాడును వారికి కట్టి హెలికాప్టర్ లో ఉన్న వారికి సిగ్నల్ ఇవ్వడంతో సురుక్షితంగా వారిని ఒడ్డుకు చేర్చారు. అర్ధగంటకు పైగా సాగిన రెస్క్యూ ఆపరేషన్ లో ఎటువంటి నష్టం జరగలేదు. భారత వాయుసేన వారికి అత్యంత అద్భుతంగా రక్షించటం దేశం మొత్తం ఆసక్తిగా వీక్షించింది.  ఈ సంఘటనతో జయహో వాయుసేన అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు అక్కడి ప్రజలు.



మరింత సమాచారం తెలుసుకోండి: