రాష్ట్రంలో వరదలు పోటెత్తి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ యాత్ర చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తోన్న  విమర్శలను, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తిప్పికొట్టారు. వరద  పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అని ఆయన మీడియాకు తెలిపారు.  వరద  ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి , మంత్రులను ఉన్నతాధికారులను ఆదేశించారని చెప్పారు .


 ప్రకాశం బ్యారేజీకి వరద ప్రభావం క్రమంగా తగ్గుతోందని,  ఇక వరద ప్రభావం పెద్దగా ఉండదని అన్నారు . బాధితులను ఆదుకోవడానికి మంత్రులు,  ఎమ్మెల్యేలు అధికారులు సమన్వయంతో పని చేశారని అనిల్ కుమార్ యాదవ్  కొనియాడారు.  కృష్ణా,   గుంటూరు జిల్లా కలెక్టర్లు , అధికారులు బాగా పని చేశారని మంత్రి  కితాబు ఇచ్చారు.  కానీ టిడిపి నేతలు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్  మండిపడ్డారు.  టిడిపి నేతలు ఒకరికొకరు సమన్వయం  లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు,  కొన్ని మీడియా సంస్థలు కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని విరుచుకుపడ్డారు.  ఎవరిని బురద రాజకీయాలు చేసినప్పటికీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారు.


 టీడీపీ నేతలు ఇకనైనా  బురద రాజకీయాలు ఆపాలని వైస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు . వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం లో ఆయన మీడియా తో మాట్లాడుతూ ... పడవ అడ్డుపెట్టి వరద తెచ్చారని కనీస లోకజ్ఞానం లేకుండా లోకేశ్ ట్వీట్లు చేస్తున్నారని విమర్శించారు . ఈ రోజు జగన్ పరిపాలనను ప్రజలంతా మెచ్చుకుంటున్నారని చెప్పారు . టీడీపీ నేతలు ,  వరదలతో  ఇబ్బందుల్లో  ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రయత్నo చేయాలని సూచించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: