ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కొరటాలతో సినిమా అయిపోయిన తర్వాత మళ్లీ రాజకీయాల వైపు దృష్టి పెట్టనున్నారని సన్నిహిత వర్గాల నుండి సమాచారం వస్తోంది. ప్రస్తుతం 'సైరా' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తన వంతు సహకారం అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ను కలిసాడు. పైగా పవన్ కళ్యాణ్ 'సైరా' సినిమా టీజర్ కు గాత్రదానం కూడా చేశాడు. పవన్ ఇచ్చిన వాయిస్-ఓవర్ ప్రోమో ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రెండింగ్ అవుతూ ఉంది. అందులో మరియు పవన్ ఎంత సన్నిహితంగా ఉన్నది మనం చూడొచ్చు. 

కొరటాల సినిమా తర్వాత చిరంజీవి ఇంకా ఏ సినిమా ఒప్పుకోలేదు. చిరు తీస్తే ఇక నుండి భారీ బడ్జెట్ సినిమాలే చేస్తారు కాబట్టి రెండు పెద్ద సినిమాల తర్వాత రెస్ట్ తీసుకుంటారు. అప్పుడే ఆయన మళ్లీ రాజకీయాల్లో కాలు మోపనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి మధ్య వారి రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే మరికొద్ది రోజుల్లో జనసేన కండువా కప్పుకొని తిరిగే చిరంజీవిని మనం చూడొచ్చు.

ఎలాగూ నాగబాబు పార్టీలో ఉన్నారు. నాగబాబుకి చిరంజీవి కి మధ్య చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. జనసేన లో చేరే విషయమై చిరంజీవితో నాగబాబు చర్చించడం కూడా జరిగిందని కొన్ని వర్గాల నుండి సమాచారం వస్తోంది. ఇదే కనుక నిజమైతే సరిగ్గా ఎన్నికలకు ముందు కాకుండా చిరంజీవి ఇంకా ముందే పార్టీలో చేరి పరిస్థితులు చక్కదిద్దే అవకాశం ఉంది. 

ఇక ఒకవేళ చిరంజీవి పార్టీలో కనుక చేరితే మెగా హీరోలనందరినీ మనం ఎన్నికల సమయంలో ప్రచారంలో చూడొచ్చు. మొన్న జరిగిన ఎన్నికల్లో వరుణ్ తేజ్, నీహారిక నాగబాబు నియోజకవర్గంలో పర్యటించారు. ఇక చిరు అంటే పడి చచ్చిపోయే అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ తప్పక బరిలోకి దిగుతారు. అయితే పవన్ ప్లాన్లు ఎలాగ ఉన్నాయో ఇప్పటికీ మనకి తెలియదు.

ఎలాంటి సోషల్ మీడియా సపోర్టు లేకుండా, అతి తక్కువ వనరులతో, వైయస్సార్ హవా కొనసాగుతున్న సమయంలో 18 సీట్లు నెగ్గిన చిరుకి ఉన్న అవగాహన జన సేన పార్టీని మరింత బలోపేతం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: