ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన తరువాత పాకిస్తాన్ ఇండియాపై అనేక ఆరోపణలు చేయడం  మొదలు పెట్టింది.  ఆరోపణలు చేయడం వలన పాకిస్తాన్ కు ఏమైనా లాభం వచ్చిందా అంటే అది శూన్యమనే చెప్పాలి.  అంతర్జాతీయంగా అనేక దేశాలు ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి. పాకిస్తాన్ కు ఒక్క చైనా తప్పించి మరే దేశం కూడా సపోర్ట్ చేయడం లేదు.  దీంతో ఏం చేయాలో తెలియక పాపం అనేక ఇబ్బందులు పడుతున్నది. ఏం మాట్లాడుతున్నతో తెలియకుండా మాట్లాడుతున్నది.  


నిన్నటి వరకు కాశ్మీర్ లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన పాకిస్తాన్, ఇప్పుడు ఇండియా అణ్వస్త్ర విధానం ఇబ్బందిగా మారే అవకాశం ఉందని, దాని ప్రాభవం కారణంగా పాకిస్తాన్ లోని ప్రజలు సఫర్ అవుతున్నారని ఎలాగైనా ఇండియాను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.  పాకిస్తాన్ చేస్తున్న వ్యాఖ్యలను ఎవరు పట్టించుకోవడం లేదు.  


అంతేకాదు, ఇప్పుడు మరో వాదనను తెరపైకి తీసుకొచ్చింది.  కాశ్మీర్ విషయంలో ఇదని తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు ప్రభావం.. ఆఫ్గనిస్తాన్ పై పడిందని .. ఆఫ్గనిస్తాన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించింది.  పాకిస్తాన్ చేసిన ఈ ఆరోపణనలను ఆఫ్గనిస్తాన్ తిప్పికోట్టింది. పాక్ కు ఆఫ్గనిస్తాన్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కానీ పాకిస్తాన్ పశ్చిమప్రాంతంలో భారీ సైనిక బలగాలని మోహరిస్తోందని.. దీనికి కారణం ఏంటో చెప్పాలని ఆఫ్గనిస్తాన్ డిమాండ్ చేసింది.  


పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే కాకుండా.. ఆఫ్గనిస్తాన్ వైపు వాళ్ళను పంపి ఆఫ్ఘన్ దేశంలో అలజడులు సృష్టిస్తున్నారనిముందు వాటిని మానుకోవాలని అప్పుడే పాకిస్తాన్ అభివృద్ధి చెందుతుందని ఆఫ్గనిస్తాన్ ఆఫ్రికన్ రాయబారి పేర్కొన్నారు.  పాకిస్తాన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.  ఉగ్రవాదాన్ని రూపుమాపాలని అమెరికాతో సహా అన్ని దేశాలు పాక్ పై ఒత్తిడి తెస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: