ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే.  అయితే ఎన్నో ఆశాలతో విపరీతమైన ప్రచారం చేసిన అధికార పార్టీ టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.  తర్వాత పోస్ట్ మార్టం చేసుకుంటే..తమ నాయకుల సమన్వయ లోపం.. కొంత మంది చేసిన నిర్వాకాలే టీడీపీ ఓటమికి కారణం అని తెలుసుకున్నారు.   ఈనేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  తన పార్టీ సభ్యులతో సమయం చిక్కినప్పుడల్లా ప్రస్తావిస్తున్నారు...తాము ఎందుకు ఓడిపోయాం..అసలు కారణం ఏంటీ అని. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపిలో డ్రోన్ రాజకీయం ప్రకంపణలు సృష్టించిన విషయం తెలిసిందే.

కాగా, తమ అధినేతను అధికార పార్టీ వాళ్లు చంపడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు చేస్తున్నవిషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన  వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్  కృష్ణానదిలో వరద ప్రశాంతంగా ముగిసిందని కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల బురద రాజకీయాలు మాత్రం ఆగలేదని విమర్శించారు. అక్రమ కట్టడంలో ఉండటం తప్పని తెలిసినా కూడా చంద్రబాబు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా మాట్లాడుతున్నారని అన్నారు.  వరద, ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి డ్రోన్‌ ఉపయోగిస్తే తప్పేంటని చెప్పుకొచ్చారు. ముంపు బాధితులను ప్రభుత్వం రక్షించడానికి ప్రయత్నించడం తప్పా అని ప్రశ్నించారు. 

అయితే తమ అధినేతను డ్రోన్లు ఉపయోగించి చంపడానికి ప్రయత్నిస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు రోడ్డు మీద వెళ్తుంటే పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు. బుద్దా వెంకన్న, దేవినేని ఉమాలు నోరు అదుపులో పెట్టుకోవాలని జోగి రమేష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును ప్రజలు ఎప్పుడో హత్య చేసి 23 అడుగుల గొయ్యిలో పాతేశారని జోగి రమేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: