ఏపీలో ప్రస్తుతం డ్రోన్ రాజకీయంపైనే వాడీ వేడీ చర్చలు నడుస్తున్నాయి. ఈ మద్య ఏపిలో వరుసగా కురిసిన వానలకు జలాశయాలు నిండిపోయాయి. ముఖ్యంగా కృష్ణ పరీవాహక ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరడంతో కొన్ని నివాసాలు ముంపునకు గురయ్యాయి. అందులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇల్లు ఉండటం విశేషం. 

మొదటి నుంచి ముంపు ప్రాంతంలో నివాసాలు నిర్మించడం ఎంత వరకు సేఫ్ జోన్ కాదని వైసీపీ నేతలు అంటున్నారు..అయితే ఇప్పుడు భారీగా నీరు చేరడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నవిషయం రూఢీ అయ్యింది.  అయితే వరద పరిస్థితిని అంచనా వేడయం కోసం ఇరిగేషన్ శాఖ అనుమతితోనే డ్రోన్లలతో ఎంత వరకు ముంపునకు గురైంతో అన్న విషయంపై ఆరా తీస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ తెలిపారు.

ప్రైవేటు వ్యక్తులు డ్రోన్లు ప్రయోగించారని, దీనివెనుక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రమేయం ఉందని, బాబు ఇంటిపై దాడి చేయడానికే ఆ పనిచేశారని టిడిపి నేతలు ఆరోపించారు. తర్వాత వరద పరిస్థితిని అంచనా వేయడానికి తామే డ్రోన్లను వినియోగించామని జలవనరుల శాఖ ప్రకటించింది.  ఇరిగేషన్‌ శాఖ అనుమతితోనే వరద పరిస్థితిని అంచనా వేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని నీటిపారుదలశాఖ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ అన్నారు.

సచివాలయంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన డీజీపీ గౌతం సవాంగ్ ఈ విషయాన్ని పెద్దగా చేయవొద్దని..ఇందులో ఎలాంటి కుట్ర లేదని, రాజకీయం చేయకూడదని  డీజీపీ గౌతం సవాంగ్ టీడీపీ నేతలకు సూచించారు.  వరద పరిస్థితిని అంచనా వేసేందుకే డ్రోన్ కెమెరాను ఉపయోగించారని డీజీపీ వివరించారు. డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తున్న విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పని కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని డీజీపీ అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: