హరిహరులు ఒక్కరే అని మనకు వేదాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని నిజం చేస్తూ ప్రస్తుతం ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం వీరభద్ర నారాయణ అతి పురాతన రాతి విగ్రహాన్ని కనుగొన్నారు. ఈ ప్రాంత చరిత్ర పరిశోధకు లు కుందారపు సతీష్ కుమార్ ఈ అరుదైన విగ్రహం గురించి వెలుగులోకి తెచ్చారు. భూపతిపూర్ గ్రామంలో పురాతన అరుదైన వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఉన్న రాతి గుండె మీద చెక్కిన శిల్పం అపూర్వమైనది. ఈ విగ్రహంలో వీరభద్రుడు వీర నారాయణుడు ప్రతిమ లక్షణాలూ జమిలీగా కనిపిస్తున్నాయి.


వీరభద్రుడు ధరించే ఖడ్గం, కైజర్, ఛురిక, డాలు, త్రిశూలం, డమరుకం, కాక విల్లములున్నాయి. విగ్రహం శీర్షికన కుడివైపు పది లింగాల వాటి కింద శంఖు చక్రాలు, ఎడమవైపు పది శంకుచక్రాలు వాటి కింద లింగాల తోరణ శిల్పంగా ఉన్నాయి. మూర్తి తలమీద ఐదు పడగల నాగు గొడుగు పట్టి ఉన్నాడు. మూర్తి తలకి ఇరువైపులా చక్ర శంకువులు నాగాభరణం లింగం ఉన్నాయి. మూర్తి నుదుట త్రిపుండ్రాలు వెనుక విభూతి రేఖలు ఉన్నాయి. మూర్తి తలపై కరంట మకుటం ఉంది. మూర్తికీ మీసాలు ఉన్నాయి. ఇవి వీరభద్రుడికి వీర నారాయణుడికి సమానమే. స్థానిక రూపంలో ఉన్న ఈ మూర్తికీ మేకల ధోవతి కాళ్ళకు కడియాలు అందెలు ఎత్తుమడమల పావుకోళ్లు కనిపిస్తున్నాయి. రాతి గుండెకు చెక్కిన ఈ శిల్పం పది అడుగుల ఎత్తు ఐదు అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శిల్పం గురించి ప్రతిమా లక్షణాలనూ చర్చించేవారు కార్తికేయుడు విశ్వక్సేన ప్రతాప రామ శంకరనారాయణ, కార్తవీర్య, ప్రత్యా లీడ సుదర్శనమూర్తి అని అన్నారు. కానీ ఈ శిల్పం లో ఉన్న హరిహర రూపాన్నీ పేర్కొనలేదు ఈ మూర్తి స్థానికంగా వీరభద్రుడి గా పూజలందుకుంటోంది పద్నాల్గు పదిహేనవ శతాబ్దాలకు చెందిన హరిహర రూపం వీరభద్ర వీరనారాయణల ప్రతిభా లక్షణాలతో ఉన్న ఈ విగ్రహాన్ని వీరభద్రం నారాయణుడు అని పిలుచుకోవాలి.


ఈ విగ్రహం శైవం మరియు వైష్ణవ మతాల మేళవింపులతో సర్వమతాల సారాంశం ఒక్కటే అని తెలియజేస్తుంది.భూపతిపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రక్కన ఉన్నటువంటి ఈ రాతి శిల పైన క్రీస్తు శకం పద్నాల్గవ శతాబ్దానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని పురావస్తు శాఖ వారి పరిశోధనల్లో కొద్ది రోజుల క్రితం కనుక్కోవటం జరిగింది. ఈ విగ్రహాం ఐదు తలల నాగుపాము నీడగా ఉంటూ పదహారు చేతులు, పదహారు ఆయుధాలతో ఈ స్వామి ఇక్కడ ఉన్నట్లు దర్శనమిస్తారు. ఈ విగ్రహాన్ని వీరభద్ర నారాయణుడు కార్తవీర్యార్జునుడుగా పేర్కొనడం జరుగుతుంది అయితే ఈ స్వామి శివలింగాల శంకు చక్ర నామాలతో ఉండటం వల్ల శైవ వైష్ణవ మతాలకు అతీతంగా ఈ స్వామిని పేర్కొనడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: