ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమించింది  . ప్రస్తుతం ఎగ్మో ఐఎబిపి సాయంతో వైద్యుల ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు  . గుండె, మూత్రపిండాలకు సంబంధించి అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీని ఈ నెల తొమ్మిదవ తేదీన ఎయిమ్స్ లో చేర్పించారు . నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్సను అందిస్తుంది  . మరోవైపు ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు  .


ఈరోజు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎయిమ్స్ కు వెళ్లి జైట్లీని పరామర్శిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి . ఇప్పటికే డయాలసిస్ అందిస్తున్న వైద్యుల బృందం నిన్న సాయంత్రం ఆయనకు గుండె శ్వాస వ్యవస్థలకు తోడ్పాటందించే ఎక్స్ ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ వ్యవస్థతో ఉంచింది  .


రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ సహా కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, జితేందర్ సింగ్, హర్షవర్దన్, అశ్వనీకుమార్, రాంవిలాస్ పాశ్వాన్ ఢిల్లీ ఎయిమ్స్ కు వెళ్లి ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు . ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎంపిలు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ , గౌతమ్ గంభీర్ కూడా పరామర్శించారు . ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోపాల్, సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ కూడా ఎయిమ్స్ కు వచ్చి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు .

ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమించింది . ప్రస్తుతం ఎగ్మో ఐఎబిపి సాయంతో వైద్యుల ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు . గుండె, మూత్రపిండాలకు సంబంధించి అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీని ఈ నెల తొమ్మిదవ తేదీన ఎయిమ్స్ లో చేర్పించారు . నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్సను అందిస్తుంది .

మరోవైపు ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు .ఈరోజు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎయిమ్స్ కు వెళ్లి జైట్లీని పరామర్శిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి . ఇప్పటికే డయాలసిస్ అందిస్తున్న వైద్యుల బృందం నిన్న సాయంత్రం ఆయనకు గుండె శ్వాస వ్యవస్థలకు తోడ్పాటందించే ఎక్స్ ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ వ్యవస్థతో ఉంచింది.రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ సహా కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, జితేందర్ సింగ్, హర్షవర్దన్, అశ్వనీకుమార్, రాంవిలాస్ పాశ్వాన్ ఢిల్లీ ఎయిమ్స్ కు వెళ్లి ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు .


ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎంపిలు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ , గౌతమ్ గంభీర్ కూడా పరామర్శించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోపాల్, సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ కూడా ఎయిమ్స్ కు వచ్చి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. బీజేపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమించటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: