వినాయకచవితి సందర్భంగా ఊరి ప్రజలందరూ ఒకే వేదిక వద్ద ఒకే వినాయకుని విగ్రహం ఏర్పాటుచేసి పూజల్లో పాల్గొంటే ఎలావుంటుంది? వినడానికే ఎంత బాగుంధీ  కదా. నిజంగా ఇది నిజమే. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరం కలిసి ఒకే దగ్గర వినాయకుని పూజ చేద్దామని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఇచ్చిన పిలుపునకు మిట్టపల్లి గ్రామం స్పందించింది. 


గ్రామంలోని యువత, మహిళలు, రైతులు, ప్రజాప్రతినిధులు సహా అన్ని వర్గాలూ హరీష్ రావు నిర్ణయానికి ఓకే అన్నాయి. భక్తజన సంఘాలూ సరేనన్నాయి. ఇలా అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. అంతేకాదు... మిట్టపల్లి స్ఫూర్తిగా మరో ఐదు గ్రామాలు కూడా అదే నిర్ణయం తీసుకున్నాయి. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్, మాచపూర్ బండ చెర్లపల్లి, నారాయణరావుపేట మండలం కోదండరావుపల్లి గ్రామాల ప్రజలు కూడా... ‘పర్యావరణ పరిరక్షణకు మేమూ ముందుకొస్తాం. మా ఊరిలో ఒక్కడే వినాయకుడిని పెట్టుకుంటాం’ అంటూ తీర్మానాలు చేసుకున్నారు. వాటి ప్రతులను హరీష్‌రావు అందించారు. 


ఇదిలావుంటే.. తన పిలుపునకు వెంటనే స్పందించి సమాజం పట్ల తమ భాధ్యతను తెలియజేసిన మిట్టపల్లి గ్రామానికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని హరీష్‌రావు ప్రకటించారు. ఎపుడు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో నిత్యం జనంతో మమేకమయ్యే హరీష్ రావు కు మంత్రి వర్గంలో  స్థానం లేకపోవడం.. ఇటువంటి నాయకుడు మంత్రిగా ఉంటే ప్రజలకు మరింత మంచి జరుగుతుందనేది సిద్ధిపేట జిల్లా వాసుల అభిప్రాయం.ఇకపోతే.. ఎన్నికల అనంతరం కెసిఆర్ మంత్రివర్గంలో హరీష్ కు బెర్త్ ఉంటుంది అనుకున్నారు అందరు. కానీ.. కెసిఆర్ అందరు అంచనాలను తలకిందులు చేస్తూ తన తనయుడు కేటీర్, హరీష్ ను మంతివర్గంలోకి తీసుకోలేదు. అప్పటినుండి హరీష్ రాజకీయ భవితవ్యంపై రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. ఇవన్నీ పట్టించుకోని హరీష్ తన పనిలో తాను నిమగ్నమయ్యాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: