బాధితులను ఆదుకుంటాం

  మహారాష్ట్ర  ను ముంచెత్తిన ఆకస్మిక వరదలతో    యావత్ మహారాష్ట్ర అతలాకుతలం అయిందని జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైన  పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయని వాటిని చక్కదిద్దే దిశగా తమ వంతు ప్రయత్నం చేస్తూ  వరద బాధితులకు చేయూత అందించి ఆదుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు.

 ప్రస్తుతం రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలు  రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలుగజేస్తాయని  శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. ఈ విపత్తు వల్ల దెబ్బతిన్న రాష్ట్రం  కోలుకోవడానికి రాష్ట్ర ప్రజలు అందరూ నడుం కట్టి సహాయం చేయాలని శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ విజ్ఞప్తి చేశారు.   ఈ వరదల లో చిక్కుకుని నష్టం వాటిల్లిన సొంత ఇంటి దారులకు మన మంత్రి ఇ ఆవాస్ యోజన కింద నూతనంగా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు.   నష్టపోయిన అద్దె ఇంటి వాళ్లకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల వాళ్లకు వాళ్ల కేటగిరీని బట్టి 24000 లేదా 34 వేల రూపాయలను నష్టపరిహారంగా చెల్లిస్తామని  మరియు నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలియజేశారు.

ఈ విపత్తుకు 5 కోట్ల   రూపాయలు విరాళంగా ఇచ్చిన  రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యానికి  తన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వరదలు  రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు కూడా కొంత నష్టపోయాయి  అని చెప్పారు. ఇంకా కొంతమంది వరద బాధితులు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నట్లు మీడియా సమావేశంలో శ్రీ  దేవేంద్ర ఫడ్నవీస్ తెలియజేశారు



మరింత సమాచారం తెలుసుకోండి: