భారత ప్రభుత్వం ప్రపంచానికి ఒకదాని తరువాత ఒకటి షాక్ ఇస్తోంది.  2014 లో మోడీ మొదటిసారి ప్రధానిగా ఎంపికైనపుడు ప్రపంచం నివ్వెరపోయింది.  మోడీ ప్రధానిగా ఎంపికయ్యారు అంటే తప్పకుండా దేశానికీ మంచి రోజులు వస్తున్నాయని.. అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని అందులో ఎటువంటి సందేహం అవసరం లేదని చాలామంది ప్రముఖులు చెప్పుకోచ్చారు. 



వారంతా చెప్పిన విధంగానే మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న అతి పెద్ద నిర్ణయం పెద్ద నోట్ల రద్దు.  ఈ రద్దుతో దేశం ఒక్కసారిగా షాక్ అయ్యింది.  నోట్ల రద్దు తరువాత చాలాకాలం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలు తగ్గిపోయాయి.  డబ్బు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.  పైగా ఏటీఎం మిషన్ల నుంచి కొంతమాత్రమే డబ్బు బయటకు వచ్చేది.  


దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.  మోడీ ఛరిష్మా తగ్గిపోయిందని వాదించారు.  కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిపాలైంది.  దీంతో మోడీ నెక్స్ట్ ప్రధాని కాలేడని వాదించారు.  కానీ వారి వాదనలకు బలం లేకపోయింది.  ప్రధాని మోడీ 2019 వ సంవత్సరంలో భారీ విజయం సాధించాడు.  గతంలో కంటే 2019 లో ఎక్కువ సీట్లు సాధించారు.  


బీజేపీకి భారీ మెజారిటీ ఇవ్వడంతో రెండు సభల్లో బీజేపీ సంఖ్యాబలం పెరిగింది.  ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ పడుతూ వస్తున్న త్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం లభించింది.  చట్టరూపం దాల్చింది.  ఎప్పుడైతే త్రిపుల్ తలాక్ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆమోదం లభించిందో ఆ తరువాత వెంటనే ఆర్టికల్ 370 బిల్లును ప్రవేశపెట్టి రద్దు చేశారు.  దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద నిర్ణయంగా చెప్పొచ్చు.  ఈ బిల్లు అమలు తరువాత ఇప్పుడు కేంద్రం మరొక నిర్ణయం తీసుకోబోతున్నదని తెలుస్తోంది.


ఆ నిర్ణయం ఏంటి అన్నది బయటకు రావడం లేదు.  ఒకవేళ ఆ నిర్ణయం తీసుకొని అమలు చేస్తే.. ప్రపంచం యొక్క దిశా మారిపోతుంది.  ప్రపంచం దృష్టి యావత్తు భారత్ వైపు చూస్తుంది. మరి కేంద్రం తీసుకోబోయే ఆ నిర్ణయం ఏంటో తెలియాలంటే కాస్త వెయిట్ చేయక తప్పదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: