అతరించిపోయే జాబితాలో పశువులూ, జంతువులూ, మొక్కలూ లాగే చాక్లెట్స్ కూడా చేరిపోతున్నాయా.? 2050 తరువాత చాక్లెట్స్ కనిపించవా అంటే అవుననే చెబుతున్నాయి లెక్కలు. ఈ మధ్యన ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తుంది. అయితే ఇది కేవలం పరిశీలన మాత్రమే కాదు అధ్యయనమని కూడా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ లెక్కలు తేల్చిచెప్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి 294 చాక్లెట్ లను  పండించేటువంటి కొకోవా బీన్స్ నుంచి కకోవా ప్లాంట్స్ అనేది వస్తుంది. కకోవా ప్లాంట్స్ నుంచి కొకోవా బీన్స్ వస్తూ ఉంటాయి. ఈ కకోవా ప్లాంట్స్ 294 దేశాల్లో విపరీతంగా పండుతూ ఉంటాయి.


అందులో మనం మాట్లాడుకుంటే ఆఫ్రికన్ కంట్రీస్ ఐవరీ కోస్ట్ అలాగే ఘన ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి చాక్లెట్ కి సంబంధించి 50 శాతానికి పైగా ఉత్పత్తి అనేది ఇక్కడ ఈ రెండు దేశాల నుంచి ఐవరీకోస్ట్ అలాగే ఘనా నుంచి కనిపిస్తుంది.వస్తున్నటువంటి వాతావరణ మార్పులు కర్బన ఉద్గారాల్లో విపరీతమైనటువంటి పెరుగుదల అలాగే గ్లోబల్ వార్మింగ్ ఈ నేపధ్యంతో కకోవా ప్లాంట్స్ పై ప్రభావితం అనేది కనిపిస్తుంది లెక్కల ప్రకారం 294 ప్రాంతాల్ని కనుక పరిశీలించినట్టయితే  అందులో ఒక ఉత్సాహవంతమైన అంశం కనిపిస్తోంది. వస్తున్నటువంటి మార్పులన్నీ తట్టుకొని నిలబడగలిగిటువంటి శక్తి కేవలం 10.5 కకోవా ప్లాంట్స్ లో మాత్రమే కనిపించింది. అంటే 89.05 శాతం మొక్కల్లో కకోవా మొక్కలు ఆ మారుతున్నటువంటి మార్పుల్ని తట్టుకోలేకపోయాయి.

ఇక కకోవా ప్లాంట్స్ కు సంబంధించి చూసుకుంటే విపరీతం అయినటువంటి వర్షాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ పంట పండుతుంది. అంటే నేలలో ఉన్నటువంటి తేమని ఉపయోగించుకుని కకోవా ప్లాంట్స్ కొకోవా బీన్స్ ని ఇస్తూ ఉంటాయి. దీనివల్లే చాక్లెట్స్ ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఆఫ్రికన్ కంట్రీస్ లో పండుతున్నటువంటి కొకోవా బీన్స్ నుంచి వచ్చేటువంటి చాక్లెట్స్ లో ఎక్కువగా నార్త్ అమెరికాతో పాటుగా యూరోపియన్ దేశాలకి వెళ్తుంటాయి. చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమైతే యూరోపియన్ దేశాలలో ప్రతి ఒక్క మనిషి 286 చాక్లెట్ బార్స్ ని ప్రతి సంవత్సరం తింటుంటారని లెక్కలు చెప్తున్నాయి.


మన దగ్గర అంత మొత్తంలో తినక పోయినప్పటికీ యూరోపియన్ దేశాలలో ఇంత పెద్ద మొత్తంలో చాక్లెట్స్ తినడం అనేది జరుగుతుంది. అలాగే 2050 నాటికి ఉత్పత్తి కనక 50 శాతం తగ్గిపోయినట్లయితే  విపరీతమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం కన్పిస్తోంది.రెండు వేల యాభై తరవాత చాక్లెట్స్ లేకపోతే ప్రపంచం ఏమవుతుంది. చూడ్డానికి చిన్న విషయమే అయినప్పటికీ మన చేజేతులారా చేసుకున్నటువంటి పరిస్థితి ఇది. ఈ భూగోళం అనేది కేవలం మన కోసం మాత్రమే కాదు మన తర్వాత తరం వాళ్ళ కోసం కూడా ఉంది అనేటువంటి ఒక ఆలోచన కనుక చేయగలిగితే తర్వాత తరం కోసం ఒక 30 ఏళ్ల తరవాత చాక్లెట్స్ అంతరించిపోకుండా ఉండే అవకాశం ఉంది.


ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి,వినిపిస్తున్నటువంటి వార్తలన్నీ నిజమే. మన చేతుల్లోనే ఉంది మన భవిష్యత్ తరాలకు మనమే ఇవ్వగలుగుతున్నామని. అందులో ప్రత్యేకంగా తాగే నీరు పీల్చే గాలి తినే తిండి వీటన్నిటితోపాటుగా వేడుకలలో ఉపయోగపడేటువంటి చాక్లెట్స్ మీద కూడా ప్రభావం పడబోతోంది.  చాక్లెట్స్ ని అయినా తర్వాత తరానికి ఇద్దామా లేదా అనేది మన మీదే అధారపడినటువంటి పరిస్థితి. మనమే ఆలోచించుకోవాల్సిన ఎటువంటి అవసరం ఏర్పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: