పాకిస్థాన్ కల్లో సైతం కనిపించే వినిపించే పేరు కాశ్మీర్. అందాల కాశ్మీర్లో కుంకుమ పూలు పూస్తాయి ఎర్రగా. అలాగే యాపిల్ పళ్ళు కూడా కాస్తాయి ఎర్రెర్రగా. అటువంటి సుందర రాష్ట్రంలో ఇన్నేళ్ళుగా ఎర్రెర్రగా రక్తం పారించి అందులోనే తన ఉగ్ర ప్రతిబింబాన్ని చూసుకున్న చరిత్ర పాక్ ది. ఇపుడు అక్కడ తోకాడించే లోకల్ పాలన లేదు. కేంద్రం  గుత్తాధిపత్యంలోకి కాశ్మీర్ వెళ్ళిపోయింది. 


చిగురాకు కదిలినా మోడీ సర్కార్ పాక్ ని మొత్తాన్ని వణికించేందుకు సిధ్ధంగా ఉంది. మోడీ ఇపుడు కాశ్మీర్  జయించిన వీరుడు. లోకం చుట్టిన విజేత. కాశ్మీర్ పై ఐక్య రాజ్య సమితి సైతం ఏం అనలేని పరిస్థితి. అమెరికా కూడా గట్టిగా మాట్లాడలేదు. చైనాకు జరగాల్సిన అవమానం జరిగిపోయింది. ఈ దశలో పాక్ చిత్తు అయి మూలన కూర్చుంది. ఇంటి మీదకెక్కి అరచి గీ పెట్టినా పరువు పోయింది తప్ప పట్టించున్న వారు ఎవరూ కనిపించలేదు. దాంతో గంగవెర్రులెత్తున్న పాక్ కి కిర్రెక్కించే విధంగా రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ గట్టి కౌంటర్లేస్తున్నారు.


పాక్ తో చర్చించేదేముంది అంటూ రాజ్ నాధ్ ఎకసెక్కం ఆడుతున్నారు. పెద్ద కచ్చె కట్టుకుని ఐక్య రాజ్య సమితి దాకా వెళ్లారుగా. అక్కడ ఏమైంది,  పాక్ తలకు బొప్పి కట్టిందని కూడా రాజ్ నాధ్ మొత్తం సిగ్గు తీసేశారు. పాక్ తో మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఒకవేళ చర్చలు అంటూ జరిగితే ఆక్రమిత కాశ్మీర్ మీదనే అంటూ అజెండా కూడా సిధ్ధం చేసి పెట్టేశారు.


అంటే కాశ్మీర్ సమస్య ఇపుడు ఎక్కడా లేదు. ఆ అంశం వెనక్కి పోయి ఆక్రమిత కాశ్మీర్ ముందుకు వచ్చింది. గత డెబ్బై ఏళ్ళుగా హాయిగా దురాక్రమించిన ఆక్రమిత కాశ్మీర్లో తన హవా చాటుకుంటున్న పాక్ కి ఇపుడు చర్చలు అంటే ఉన్న చోటనే భూ కంపం వస్తుంది. పీఓకే కూడా పోయే ప్రమాదం ఉంది. ఇక భారత్ అంతటితో వూరుకుంటుందా బెలూచిస్తాన్ని  విడిపించేసి పాక్ కి మరిన్ని తలనొప్పులు తెస్తే. మొత్తానికి పాక్ బాగా ఇరుక్కుపోయింది. మరి తగిన మొగుడు మోడీ కదా భారత్ ని ఏలుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: