వైకాపా అధికారం లోకి వచ్చిన అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,  శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అక్రమాలకు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి .  కోడెల కుమారుడు , కూతురు సాగించిన అక్రమాలపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెల్సిందే . తాజాగా కోడెల  ఇంటి ముందు ఒక కేబుల్ ఆపరేటర్ ఆందోళనకు దిగారు .  నరసరావుపేటలో ఎం సి వి పేరుతో కోటేశ్వరరావు అనే వ్యక్తి కేబుల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు.


 కోడెల తనయుడు శివరామకృష్ణ కేబుల్ వైరు కత్తిరించి కేబుల్ వ్యాపారాన్ని కబ్జా చేశారని ఆందోళన వ్యక్తం చేస్తూ ,  కేబుల్ వైర్లను  అయన  ఇంటి ముందు పడేసి సోమవారం బాధితుడు  ఆందోళనకు దిగారు . ఊరు విడిచి పోయే పరిస్థితి శివరామకృష్ణ కల్పించాలంటూ బాధితుడు కోటేశ్వర్  రావు  విమర్శలు చేశారు. కమ్మ హాస్టల్ భవన  నిర్మాణంలోనూ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు . ఇదిలా ఉండగా టిఆర్ లేకుండా సుమారు 800 బైక్లు విక్రయించిన వ్యవహారంలో కోడెల శివ రామకృష్ణ పై కేసు నమోదైన విషయం తెలిసిందే.


  ప్రభుత్వానికి చెల్లించాల్సిన 80 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించిన రవాణాశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కోడెల శివరామ కృష్ణ పై  పోలీసులు కేసు నమోదు చేశారు.  గుంటూరు చుట్టుగుంట సెంటర్ లో కోడల శివ రామ్ హీరో బైక్ షో రూమ్  ఉంది. టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు ఈ షో రూమ్ నుంచి 800  బైక్ లు టిఆర్ లేకుండా విక్రయించగా , అప్పట్లో టీడీపీ అధికారం లో ఉండడం తో రవాణా శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేదు .


మరింత సమాచారం తెలుసుకోండి: