పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ అంటే తెలియనివారుండరు.చిన్నపిల్లలకైతే మరి మరి ఇష్టమని చెబుతారు..భారత దేశ తొలి ప్రధాని,భారత స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ నాయకుడు.పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు,చరిత్రకారుడు కూడా.అంతేకాకుండ భారత రాజకీయాలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.  ఇంత గొప్ప చరిత్ర వున్న నెహ్రూ గారు క్రిమినల్ అంటే ఆశ్చర్యపోనివారుండరు.కాని అసలు జరిగిన విషయమేంటంటే ఈ మధ్య అమలైన ఆర్టికల్ 370 పై రాజుకున్న రగడలో ఈయన్ని క్రిమినల్ చేశారు..అదెలాగంటే ఆర్టికల్ 370 విధించిన పండిట్ నెహ్రూ క్రిమినల్ అని బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహన్ ఇదివరకు చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సమర్థించిన విషయం తెలిసిందే.




నెహ్రూ అనాలోచిత నిర్ణయం వల్లే 70 ఏళ్ల కశ్మీర్ వెనుకబాటుకు గురైందని విమర్శించారు.అక్కడ ఉగ్రవాదంపెరిగి,ప్రజల జీవన ప్రమాణస్థాయి తగ్గడానికి కారణం అప్పటి పాలకులేనని మండిపడ్డారు.నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాన్ని మోడీ సరిచేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.తన దేశ ప్రజలను సమానంగా చూడకుండా..వివక్ష చూపిన వారు ఎంతటివారైనా శిక్షార్షులు అని స్పష్టంచేశారు సాద్వీ.అంతేకాదు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా,కశ్మీర్ ప్రజల పాలిట నిజమైన దేశభక్తులని కొనియాడారు.ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ ప్రజలకి మోక్షం కలిగించన ఈ BJPప్రభుత్వం చరిత్రలో  నిలిచి పోతుందని, అయితే ఆర్టికల్ 370 రద్దుపై కొందరు పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.




ఈ సందర్భంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై కూడ విరుచుకు పడ్డారు సాద్వీ.ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రజలకు మేలు జరగుతుందని ఎవరు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు.ఇకపోతే గత ఎన్నికల్లో భోపాల్ నుంచి సాద్వీ,దిగ్విజయ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.దీనిని బట్టి భోపాల్ ప్రజలు తనను ఎందుకు ఎన్నుకున్నారో అర్దం చేసుకోండని వారు దేశ ప్రయోజనాలు ఆశించి ఎంచుకున్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ లో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా నెహ్రుతీరుపై తీవ్రవిమర్శలు చేశారు. నెహ్రూ చేసిన తప్పును ఇప్పుడు మోదీ సరిదిద్దారంటూ అమిత్ షా బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.ఇప్పుడు శివరాజ్ సింగ్ మరో అడుగు ముందుకేసి నెహ్రూను ఏకంగా క్రిమినల్ అనడంతో కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.ఆజ్యానికి అగ్నితోడైనట్లు ఇప్పుడు సాద్వీ మాటలుకూడ తోడైయ్యాయి...


మరింత సమాచారం తెలుసుకోండి: