నరేంద్ర మోడీ బ్రెయిన్ కి జోహారే అనాలి. మెరుపు వేగంతో డెసిషన్లు తీసుకోవడమే కాదు, ఎక్కడా ఎలాంటి పొరపాటుకు అవకాశం లేకుండా జాగ్రత్తగా పావులు కదపడంలోనూ మోడీ దిట్ట. మోడీ గతంలోని ప్రధానులకు  పూర్తిగా భిన్నం. ఆయన స్టైలే వేరు. ఆయన దేశ, విదేశీ నేతలందరితోనూ చాలా సరదాగా ఉంటారు. మంచి సంబంధాలను కొనసాగిస్తారు. ఇపుడు అదే దేశానికి శ్రీరామరక్షగా మారుతోంది.


మోడీ ఉన్నట్లుండి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కి ఫోన్ చేశారు. నిన్న రాత్రి ఫోన్ చేసిన  మోడీ దాదాపుగా 30 నిముషాల సేపు ట్రంప్ తో మాట్లాడారని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు తెలియచేశాయి. ఈ సందర్భంగా మోడీ కాశ్మీర్ సమస్య గురించి ట్రంప్ కి వివరించారని టాక్. అదే విధంగా విభజన చేసిన దాని గురించి. ఆర్టికల్ 370 ని ఎందుకు రద్దు చేశామన్న దానిపైన కూడా మోడీ ట్రంప్ తో తన అభిప్రాయాలను పంచుకున్నట్లుగా చెబుతున్నారు.


అదే సమయంలో దాయాది పాకిస్థాన్ వేస్తున్న రంకెలు కాశ్మీర్ విషయంలో ఆ దేశం జిత్తులు, ఎత్తుల గురించి కూడా ట్రంప్ కి పరోక్షంగా మోడీ వివరించారని తెలిసింది. మొత్తానికి పెద్దన్న ట్రంప్ తో అరగంటకు పైగా మాట్లాడిన మోదీ కాశ్మీర్ విషయంలో అమెరికాకు భారత్ వైఖరి ఏంటి అన్నది క్లారిటీగా ఎటువంటి కంఫ్యూజన్ లేకుండా తెలియచేశారని అంటున్నారు.


అసలే ప్రపంచంలోని ఏ దేశం మద్దతు లేకపోవడంతో దారుణమైన అవమానం భారం, పగ ప్రతీకారంతో రగిలిపోతున్న పాకిస్థాన్ కి అదను చూసి మరీ మోడీ దెబ్బ కొట్టారని అంటున్నారు. ఇక మీదట మోడీ పాకిస్థాన్ విషయంలో వేయబోయే సరికొత్త ఎత్తుగడలకు పెద్దన్న దేశమైన అమెరికాతో దోస్తీ పెంచుకుని ముందర కాళ్ళకు బంధం బాగానే వేశారని అంటున్నారు. మొత్తానికి  మోడీ అంటే ఇదీ అని మరో మారు ప్రూవ్ చేసుకున్నారన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: