ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిస్కంలు అప్పులు తగ్గించుకోవాలంటే కరెంటు ఛార్జీలు పెంచటం తప్ప మరో మార్గం లేదని తెలుస్తోంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ పంపిణీ సంస్థలను ఇప్పటికే 20 వేల కోట్ల అప్పులు ఉండగా గడచిన మూడు సంవత్సరాల్లో మరో 7,948 అప్పులు పేరుకుపోయాయని అప్పులు తగ్గాలంటే అదనంగా ఛార్జీలు వసూలు చేయాలని డిస్కంలు కోరాయి. గత ఐదు సంవత్సరాల్లో కరెంటు ఛార్జీల్లో ఎటువంటి పెంపు జరగలేదు. 
 
2020 - 2021 సంవత్సరాలో టారిఫ్ పెంచి ప్రస్తుతం ఉన్న అప్పుల భారం తగ్గించుకోవాలని డిస్కంలు డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిస్కంలు అప్పు భారాన్ని తగ్గించుకోవటానికి ప్రభుత్వం సబ్సిడీ రూపంలో కొంత మొత్తం భరించాలని, కరెంటు ఛార్జీల పెంపు ప్రతిపాదనను కోరుతున్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ పంపిణీ సంస్థలు తీసుకునే నిర్ణయం ముఖ్యం కానుంది. కరెంటు ఛార్జీలు పెంచటానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. 
 
ప్రస్తుతం డిస్కంలు ప్రతిపాదించిన ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ పంపిణీ సంస్థలు మొదట విచారణ జరపాల్సి ఉంది. ప్రసుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మాత్రం ఉచిత విద్యుత్ అందుతుంది. వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రమలకు, సంస్థలకు, వాణిజ్య అవసరాల కొరకు, గృహ వినియోగానికి 5 కేటగిరీలున్నాయి. టారిఫ్ రేట్లు పెంచితే మాత్రం వ్యవసాయ రంగం కాకుండా మిగిలిన వాటిపై భారం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
మరి డిస్కంల ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. విద్యుత్ ఛార్జీలు పెరిగితే సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. డిస్కంలకు అప్పులు తగ్గాలంటే ఛార్జీలు పెంచటం తప్ప మరో మార్గం లేదు. మరి ప్రభుత్వం కరెంటు ఛార్జీల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: