యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజకీయాల్లో ప్రవేశించనున్నాడా?...  తనకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదంటూనే , ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడం పట్ల ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. సినిమాల గురించి తప్ప,  ఏనాడు రాజకీయాల గురించి మాట్లాడని   ప్రభాస్... ఒక్కసారి  రాజకీయాల గురించి మాట్లాడడం తో ఆయన రాజకీయాల్లో ప్రవేశించనున్నారా ? అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.  బాహుబలి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ ను  తమ పార్టీలో చేర్చుకోవాలని అన్ని రాజకీయపక్షాలు కోరుకుంటున్నాయి.


ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు భారతీయ జనతా పార్టీ (బీజేపీ )లో కీలక నాయకుడు కావడంతో ... యంగ్ రెబల్ స్టార్ కూడా అదే పార్టీలో చేరడం ఖాయమంటూ పలువురు ఇప్పటికే ఒక నిర్ణయానికి కూడా వచ్చేశారు . బాహుబలి చిత్రం విడుదల సందర్భంగా ప్రధాని మోడీ కి యంగ్ రెబల్ స్టార్ ను,  కృష్ణంరాజు పరిచయం చేయడం తో అప్పట్లోనే  ప్రభాస్ బీజేపీలో చేరడం ఖాయం అంటూ ప్రచారం కూడా జరిగింది. ప్రభాస్ రాజకీయ రంగ ప్రవేశం పై  కృష్ణంరాజు స్పందిస్తూ యంగ్ రెబల్ స్టార్  రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదన్నారు .   యంగ్ రెబల్ స్టార్ కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన హీరో కాదు... ఒక రకంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటుడు అంటూ పేర్కొన్నారు.


  ప్రభాస్ రాజకీయాల్లోకి వస్తాడా ? రాడా? అన్న చర్చ కూడా అనవసరమని ఆయన చెప్పుకొచ్చారు.  గతంలో మోడీకి ప్రభాస్ ను పరిచయం చేసిన  విషయాన్ని ప్రస్తావిస్తూ బాహుబలి  చిత్రాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా,  ఆ నాటి హోంమంత్రి రాజ్ నాథ్   సింగ్ తిలకించారని...  మోడీ తో తనకు 25  ఏళ్ల అనుబంధం ఉందని అందుకే ఆయనకు పరిచయం చేయడం జరిగిందని  కృష్ణం రాజు వివరించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: