ఈమధ్య కాలంలో విద్యుత్ చార్జీలమోతతో వినియోగదారులు హడలిపోతున్నారు..ఇటు తెలంగాణాలో కూడా చార్జీల పెరుగుదల చాపకింద నీరులా సాగింది.వినియోగదారునికి అర్దం కాని విధంగా కరెంట్ చార్జీలు వసూలు చేస్తున్నారు ఇప్పుడు.ఇదివరకు 50యూనిట్లకు ఒకస్లాబ్,100 యూనిట్లకు ఒక స్లాబ్ రేటును అమలుచేసారు.అది తీసేసి 100 యూనిట్ల వరకు ఒకరేటు 100 దాటితే డబుల్ ధమాకలా బిల్ కూడ మొదటి యూనిట్ నుండి డబుల్ అవుతుంది.ఇది సూపర్ మార్కెట్ 1+1 ఆఫర్‌లా..ఇకపోతే బిల్స్ కూడ లేట్ గా ఇవ్వడం వల్ల వందకు ఒక్క యూనిట్ ఎక్కువైన ఆనెల వాడకంలోని మొదటి యూనిట్ నుండి చార్జీ జమౌతుంది.అంటే 100 కు ఒక్క యూనిట్ ఎక్కువ కాలిన పెద్ద బొక్క జేబుకు పడటం ఖాయం.




ఇక ఏపి లో విద్యుత్ కొనుగొలులో పెద్ద గోల్‌మాల్ జరిగిందట,అంచనాలకు భిన్నంగా చోటుచేసుకన్న ఈ భారీ ఖర్చును కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఇఆర్‌సికి సమర్పించింది.గత ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన నష్టాలను ప్రజలపై ట్రూఅప్‌ పేరిట బాదడాన్ని నిపుణులు వ్యతిరేకిస్తున్నారు.ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు ఉన్నతస్థాయి అధికారులు కూడా ఈ తరహా బాదుడుకు CM వ్యతిరేకమని చెబుతున్నారు.ఇక మరింత వివరాల్లోకి వెళ్ళితే విద్యుత్‌ నియంత్రణ మండలి కి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమర్పించిన ట్రూ అప్‌ ఛార్జీల మొత్తం పదహేను వేల కోట్ల రూపాయలు.ఇది!తెలుగుదేశం ప్రభుత్వ హయంలో చోటుచేసుకున్న భారీ లోటు..




తాజాగా ఇఆర్‌సికి సమర్పించిన ప్రతిపాదనల్లో 2015-16,16-17 సంవత్సరాలకే 11వేలకోట్ల రూపాయలను విద్యుత్‌ కొనుగోళ్ల నష్టంగా చూపించారు.అయితే,ఇంత భారీ మొత్తానికి సంబంధించిన వివరాలు సమగ్రంగా సమర్పించకపోవడం గమనార్హం ఈ మొత్తంలో వాస్తవం కన్నా అంకెల మాయాజాలమే ఎక్కువట,ఈ మొత్తంలో ఇఆర్‌సి అనుమతించిన దానికన్నా తక్కువ విద్యుత్‌నే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.దీనికోసం చెల్లించిన ఫిక్స్‌డ్‌ ఛార్జీలు కూడా తక్కువే! కానీ,ఇతర ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోయాయి.ఆ ఖర్చులేమిటి?ఎందుకుపెరిగాయి?బాధ్యతఎవరిది? అనే ప్రశ్నలను గత టిడిపి సర్కారు పట్టించుకోలేదట.అన్నింటినీ సమీక్షిస్తామంటున్న జగన్‌ ప్రభుత్వం ఈ అంశం పై దృష్టి పెట్టలేదట.యధాతధంగా ఇఆర్‌సికి సమర్పించింది.ఇక ఇఆర్‌సి ఎంత అనుమతిస్తే ఆ భారం విద్యుత్‌ వినియోగదారులపై పడనుంది.




ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇఆర్‌సికి తాజాగా సమర్పించిన ట్రూ అప్‌ లెక్కలపై నిపుణుల్లో ఆసక్తికర చర్చసాగుతోంది.గడిచిన కాలానికి సంబంధించి అంచనాలకు,వాస్తవ ఖర్చుకు మధ్య చోటుచేసుకున్న తేడాను ఇఆర్‌సి అనుమతితో విద్యుత్‌ సంస్థలు వినియోగదారుల నుండి వసూలు చేస్తాయి.ఆ ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది సమర్పించిన 15వేల కోట్ల రూపాయల  హేతుబద్దత పై అనేక అనుమానాలు నెలకొన్నాయి.ఏ ఏడాదికి ఆ ఏడాది ఖర్చుల వివరాలు ఇవ్వకుండా,ఒకేసారి నాలుగు సంవత్సరాలకు ప్రతిపాదించడంతో పాటు, ఆ ఖర్చులకు సంబంధించిన కారణాలను కూడా అధికారయంత్రాంగం వివరంగా చెప్పకపోవడం దీనికి కారణం.ఈ నేపథ్యంలోనే ట్రూఅప్‌ చార్జీల ప్రతిపాదనను  తిరస్కరించాలన్న డిమాండ్‌ వారి నుండి బలంగా వస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: