వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి చెబుతుంది. ఐదేళ్లలో విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచన లేదని, ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఇప్పటీకే ఆ నాయకులూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే విద్యుత్ చార్జీలు పెంచే పరిస్థితి ప్రభుత్వానికి వస్తుందా అనే అనుమానం రాక మానదు. ఇప్పటికే రాష్ట్రం ప్రభుత్వం విద్యుత్తు డిస్కంలకు సుమారు 21000 అప్పు ఉంది. ఇంత పెద్ద మొత్తాన్ని తగ్గించుకోవాలంటే విద్యుత్ చార్జీలు పెంచాల్సిన పరిస్థితి. అయితే జగన్ ప్రభుత్వం చెబుతున్న మాట ఏంటంటే .. పీపీఏల ఒప్పందం పారదర్శకంగా జరిగి ఉంటే రాష్ట్రం మీద ఇంత అప్పు ఉండేది కాదని.


ఇప్పుడు ఏపీ ప్రభుత్వం డిస్కం లకు 18,500 కోట్లు బకాయిలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా యూనిట్ విద్యుత్ ధర సుమారు రూ 5.50  పైగా కొనుగోలు చేయడంతో రాష్ట్రం మీద అప్పు కుప్పలుగా వచ్చి చేరింది. నిజానికి పక్క రాష్ట్రాల్లో  రూ.2 నుంచి రూ. 3 ఉంటే .. ఏపీలో మాత్రం చాలా ఎక్కువగా ఉంది.  దీనితో జగన్ తప్పని పరిస్థితిలో పీపీఏల పునః సమీక్షకు పట్టు బడుతున్నారు.


ఇదే మాదిరిగా విద్యుత్ ఒప్పందాలు ఉంటే ఇంకా చెల్లించే బకాయిలు పెరిగి పోతూనే ఉంటాయి. ఇదిఇలాగే కొనసాగితే  ఏపీ ఆర్ధిక పరిస్థితి కుప్ప కూలే పరిస్థితిలోకి వస్తుంది. అందుకే జగన్ తక్కువ ఖర్చుకే విద్యుత్ ను కొనుగోలు చేస్తే డబ్బులు మిగిలిపోతాయని .. లేకపోతే పెరిగిన బకాయిలు ప్రజల మీద విద్యుత్ చార్జీల రూపంలో మోపాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ జగన్ అందుకు సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితిలో ప్రజల మీద విద్యుత్ భారం పడకూడదని .. జగన్ పీపీఏల సమీక్ష చేసి తక్కువకే  విద్యుత్ ను కొనుగోలు చేయాలనీ జగన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే జగన్ నిర్ణయం పై కేంద్రం ప్రభుత్వం కూడా సహకరించని సంగతీ తెలిసిందే. ఇక ప్రతిపక్షాల గగ్గోలు సంగతీ తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఇది ప్రపంచ సమస్య అని ట్విట్టర్లో వాపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: