జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎల్లోమీడియా విషం చిమ్ముతోంది. పారదర్శకత, అవినీతి రహిత రాష్ట్రంగా మార్చాలన్న జగన్ ఆలోచనలపై ఎల్లీమీడియా ఓ పద్దతి ప్రకారం విషం చిమ్ముతోంది. దేశంలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా దానికి జగన్ విధానాలే కారణం అన్నట్లుగా మండిపోతోంది. తాజగా గుజరాత్ రాష్ట్రంలో సోలార్, విండ్ పవర్ ఉత్పత్తికి టెండర్లు ఆహ్వానిస్తే ఆశించిన స్పందన రాలేదట. ఎందుకయ్యా అంటే ఏపిలో జగన్ అనుసరిస్తున్న విధానాలే కారణమంటూ కథనాలు వండి వారుస్తోంది.

 

చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భారీగా అవినీతి జరిగిందన్నది జగన్ అభిప్రాయం. ఆ విషయం తేల్చేందుకు నియమించిన నిపుణుల కమిటి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దాంతో అప్పట్లో విద్యుత్ కొనుగోలుకు వివిధ సంస్ధలతో కుదిరిని ఒప్పందాలను సమీక్షించాలని జగన్ నిర్ణయించారు. దాంతో ఓ పద్దతి ప్రకారం చంద్రబాబు, ఎల్లోమీడియా గగ్గోలు మొదలుపెట్టింది.

 

ఈ నేపధ్యంలోనే గుజరాత్ రాష్ట్రంలో 950 మెగావాట్ల పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. అయితే వివిధ కంపెనీల నుండి దాఖలైన టెండర్లు మాత్రం 150 మెగావాట్లకే వచ్చాయట. దాంతో ప్రభుత్వం ఆశ్చర్యపోయిందట. కారణాలేమిటయ్యా అని ఆరా తీస్తే ఏపిలో జగన్ చేస్తున్న సమీక్షలే కారణమంటూ కంపెనీలు చెప్పాయట.

 

మోకాలికి బోడిగుండుకు ముడి వేయటమంటే ఇదే. ఎక్కడ గుజరాత్ ఎక్కడ ఏపి ? ఏపిలో జగన్ విధానాలు గుజరాత్ లో ఏమీ అమలు కావటం లేదే. ఏపిలో విద్యుత్ టారిఫ్ ధరలను జగన్ సమీక్షిస్తుంటే అవే ధరలు గుజరాత్ లో కూడా అమలవ్వాలని ఏమీ లేదు. ఏ కంపెనీ అయినా  రాష్ట్రం, ప్రజలపై ప్రేమతో ఏ పని చేపట్టదు. తనకు ఆర్ధికంగా లాభం ఉంటుందని అనుకుంటేనే పనులు చేపడుతుంది. కాబట్టి ఇపుడు గుజరాత్ లో విద్యుత్ ఉత్పత్తి టెండర్లలో లాభం లేదని అనుకున్నాయేమో ? అందుకనే పెద్దగ స్పందించలేదు. అంతదానికి గుజరాత్ లో కంపెనీలు స్పందించకపోతే జగనే కారణమని చెప్పటమంటే విచిత్రంగా అనిపించటం లేదూ ?

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: