జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనపైన కూడా సోషల్ మీడియాలో తమ్ముళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. వారం రోజుల జగన్ అమెరికా పర్యటనలో కుటుంబ విషయాలతో పాటు అధికారిక పర్యటనలు కూడా కలిసే ఉంది. అధికారిక పర్యటనకు సంబంధించి డల్లాస్, కాలిఫోర్నియా లాంటి కొన్ని నగరాల్లో పారిశ్రామికవేత్తలతోను ప్రవాస భారతీయులు ప్రత్యేకించి తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.

 

అమెరికా పారిశ్రామికవేత్తలతో అయినా ప్రవాసభారతీయులతో అయినా తెలుగు పారిశ్రామికవేత్తలతో జరిపిన సమవేశాలైనా  సక్సెస్ అయినట్లుగానే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ పరిస్ధితుల్లో చంద్రబాబునాయుడు గనుక సిఎంగా ఉండుంటే ప్రచారం ఓ రేంజిలో మోత మోగిపోయేదనటంలో సందేహం లేదు. కాకపోతే జగన్ ఆర్భాటాలకు, ప్రచారానికి దూరంగా ఉంటున్న కారణంగా సమావేశాలకు రావాల్సినంత ప్రచారమైతే రావటం లేదు.

 

ఇక్కడే అదును చూసుకుని సోషల్ మీడియాలో ఎల్లో బ్యాచ్ పైత్యాలు పెరిగిపోతున్నాయి. అందుకు పై ఫొటోనే సాక్ష్యం. పై ఫొటోను చూస్తే వేదికకు ముందు వైపున ఉన్న కుర్చీలన్నీ నిండిపోయినట్లు కనబడుతోంది. అదే సమయంలో వేదికకు వెనుకవైపున అంతా ఖాళీగానే కనిపిస్తోంది. ఎక్కడైనా కానీ వేదికకు ముందువైపునే జనాలుంటారు కానీ వెనకవైపున ఎవ్వరూ కూర్చోరు.

 

ఆ విషయం తెలిసి కూడా పై ఫొటోను కావాలనే తమ్ముళ్ళు సోషల్ మీడియాలో బాగా హైలైట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే జగన్ అమెరికా పర్యటన ఫెయిలయ్యిందని ప్రచారం చేయటమే. నిజానికి జగన్ మాట్లాడుతున్నది కూడా బహిరంగసభ ఏమీ కాదు. కేవలం పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, అభిమానులు పాల్గొన్న సమావేశం మాత్రమే.

 

ఇంతమాత్రానికే జగన్ సమావేశం ఫెయిలయ్యిందని ప్రచరం చేసే పచ్చ బ్యాచ్ కు ఏమి లాభం వస్తుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇటువంటి విషప్రచారం చేయటం వల్ల తమ్ముళ్ళ శాడిజమే బయటపడుతోంది. సమావేశాలు పెట్టగానే పెట్టుబడులు పెట్టటానికి పోలోమంటూ ఎవరూ డబ్బు సూట్ కేసులతో ఏపికి వచ్చేయరు.  

 

కాకపోతే ప్రయత్నాలు చేయాలి కాబట్టే జగన్ కూడా ప్రయత్నంచేశారు. ఇటువంటి ప్రయత్నాలు చంద్రబాబు హయాంలో ఎన్ని జరిగాయో లెక్కలేదు. తర్వాత చంద్రన్న ఆడిన డ్రామాలకు కొదవే లేదు. ఆ విషయాలు మరచిపోయి జగన్ పర్యటనపై విషం చిమ్మటం తమ్ముళ్ళకు అలవాటైపోయింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: