ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నలభై ఐదు మంది మరణించగా ముప్పై మందికి పైగా గల్లంతయ్యారు. పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగి పడగా భారీగా ఇళ్లు చెట్లు నేలమట్టమయ్యాయి. పంజాబ్ లో భారీ వర్షాల కారణంగా యమున, సట్లెజ్, బియాస్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వందల తొంభై కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా అధికారులు తెలిపారు. సహాయక చర్యలు అందించేందుకు రావాల్సిందిగా ఎన్డీ ఆర్ ఎఫ్ బృందాలను కోరినట్లుగా తెలిపారు.


సిమ్లాలో తొమ్మిది మంది, సోలాన్ జిల్లాలో ఐదుగురు, కులూ, సిర్మాపూర్, చంబా జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. భారీ వర్షాల నేపథ్యంలో సిమ్లా కులూ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీలు సహా మొత్తం విద్యాసంస్థలన్నీ కూడా మూసి ఉంచాలని ఆ జిల్లాల కలెక్టర్ ఆదేశించారు. వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినగా మరి కొన్ని చోట్ల కొండచర్యలు విరిగి పడుతుండటంతో ఈ ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ అమిత్ కష్యప్ అన్నారు. వరద తీవ్రతతో సిమ్లా, కులూ జిలాల్లో అన్ని పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలతో కొండచర్యలు విరిగి పడిన ఘటనలో సిమ్లాలో ఎనిమిది మంది, కులూ, సీమర్, సోలన్, చంబా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారని అధికారులు వెల్లిడించారు.



ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల వరద నీరు ఇళ్లు, రహదారులను ముంచెత్తింది. వరద ఉధృతి కారణంగా కులూ పట్టణం సమీపంలోని వంతెన కొట్టుకు పోయింది. సట్లేజ్ నది పోటెత్తడంతో ముందు జాగ్రత్తగా సట్లేజ్ జల విద్యుత్ నిగమ్ కు చెందిన దేశంలోనే అతిపెద్ద హైడ్రో ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలను విడుదల చేశారు. వచ్చే ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుంది. దీంతో లోహ పులిగా పేరొందిన పాత ఇనుప బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిన్న మధ్యాహ్నం నుంచి నిలిపివేశారు.


యమునా నదిలో ప్రమాద స్థాయి రెండు వందల ఐదు పాయింట్ మూడు మూడు మీటర్ లు కాగా, నది ప్రవాహం రెండు వందల ఐదు పాయింట్ రెండు సున్నా మీటర్ లకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యమునా నది ప్రవాహం మరింత పెరుగుతుందని అంచనాలతో పురాతన ఇనుప వంతెనను మూసి వేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. హర్యానాలోని హత్నికూన్ బ్యారేజ్ నుంచి వరద నీటిని విడుదల చేసిన తర్వాత, యమునా నదికి వరద ప్రవాహం పోటెత్తింది. మరో వైపు వరద తీవ్రతతో ఢిల్లీలో చేపట్టాల్సిన చర్యలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో సమీక్షించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: