ఏపీలో జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి నచ్చడం లేదని తెలిసిందే. ముఖ్యంగా పోలవరం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్రం చాలా సీరియస్ గా ఉందని తెలుస్తుంది. కానీ జగన్ మాత్రం ఇవేమి పట్టించుకునే పరిస్థితిలో లేరు. నా రూటే సెపరేట్ అనే మాదిరిగా ఉంది. పోలవరం పనులు చేపడుతున్న నవయుగ కంపెనీని ప్రభుత్వం రద్దు చేసి కొత్తగా రీటెండరింగ్ కు వెళ్లిన సంగతీ తెలిసిందే. దీనితో కేంద్రం పోలవరం విషయంలో మళ్ళీ రీటెండరింగ్ కు వెళ్లాల్సిన అవసరం ఏముందని పోలవరం అథారిటీకి లెటర్ రాసింది. దీనితో జగన్ కు కేంద్ర ప్రభుత్వం మధ్య సంభందాలు బెడిసికొట్టే పరిస్థితి వచ్చిందని చెప్పాలి. 


జగన్ ప్రభుత్వం పోలవరం కాంట్రాక్టు విషయంలో అవినీతి జరిగిందని నిరూపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఇబ్బందులు తప్పవు. పోలవరానికి నిధులు ఆపేసిన ఆశ్చర్యం లేదు. ఇప్పటీకే రీటెండరింగ్ పనులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం ఇప్పుడు ఆసక్తిగా కరంగా మారింది. అయితే ఇప్పటికే పోలవరం పనులు లేట్ అయినాయని .. మళ్ళీ ఇంకాజ్ జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిన సంగతీ తెలిసిందే.


అయితే ఇప్పుడు నవయుగ కంపెనీ .. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తే కోర్ట్ మెట్టులు ఎక్కింది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యల పట్ల పోలవరం అధారిటీ ( కేంద్ర జల వనరుల శాఖ ) తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ టెండరింగ్ కు వెళ్లాల్సిన పని లేదని ఇది సమయం వృధా పని అని తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. కానీ జగన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో రీటెండరింగ్ కు వెళ్ళాలిసిందేనని చెబుతున్నారు. ఇప్పటికే రీటెండరింగ్ కు సంభందించి జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: