రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల బాధలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్రంలోని ఏ జిల్లాలో చూసినా ప్రభుత్వ స్కూళ్లు అత్యంత దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. కాలం చెల్లిన భవనాలు పట్టణ ప్రాంతాల్లో హంగు ఆర్భాటాలతో దర్శనమిస్తున్న సర్కారు బడులు. పల్లెల్లో ప్రమాదకరంగా మారాయి. నాలుగక్షరాలు నేర్చుకోవాలంటే విద్యార్దులు విషపురుగులతో సావాసం చేయాల్సి వస్తుంది. స్కూల్ కు వెళ్లిన మీ పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుకుంటారో లేదో తెలియని పరిస్థితి. అసలే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా నిత్యం జోరుగా వానలు కురుస్తున్నాయి.


దీంతో ఏ క్షణంలో ఏ స్కూల్ బిల్డింగ్ కుప్పకూలిపోతుందో తెలియని పరిస్థితి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ స్కూల్ తీసుకున్నా అన్నీ పాత భవనాలే దర్శనమిస్తున్నాయి. పాతబడ్డ భవనాల్లో విద్యార్థులు ప్రాణాలరచేతిలో పెట్టుకుని చదువుకుంటున్నారు. ఏ మూలన పెచ్చులూడి మీద పడుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు చదువుకోవాల్సిన దుస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ప్రభుత్వ స్కూళ్ల దుస్థితి మరీ దయనీయంగా ఉంది. ఎందెందు వెతికినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. పట్టణ ప్రాంతాల్లో కాస్తో కూస్తో మెరుగ్గా కనిపిస్తున్నా, పల్లెల్లో మాత్రం పరిస్థితి మరీ దారుణం. ప్రభుత్వ స్కూళ్లు పూర్తిగా శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి.


ఈ శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ల భవనాలు పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యావైద్యానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని ప్రాంతం పేరుకు హైటెక్ సిటీ అయినా నగరంలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితిలో టెక్ ఒక్క హైదరాబాద్ లోనే కాదు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితి. ఒక్క హైదరాబాద్ జిల్లాలోని 689 ప్రభుత్వ పాఠశాలలుంటే అందులో 180 హై స్కూల్స్, 509 ప్రైమరీ స్కూల్స్ ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు చెప్తున్నాయి. వీటిలో 108 స్కూళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏ క్షణంలో కూలిపోతాయో తెలియని పరిస్థితి, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో పిల్లలు చదువుకుంటున్నారు.


ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో ఒక్కో ప్రైమరీ స్కూల్ లో దాదాపు వంద మందికి పైగా విద్యార్థులున్నారు. శిథిలావస్థకు చేరిన భవనాలు ఉంటే వాటిలో అరకొర వసతులు దీంతో విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇపుడు వర్షాకాలం కావడంతో ఏ క్షణంలో అయినా భవనం కూలిపోతుందే అన్న భయం పిల్లల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ కనిపిస్తుంది. భవనాలన్నీ కూల్చివేసి వాటి స్థానంలో కొత్త భవనాలును నిర్మించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అయితే కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు స్థలాల సేకరణ లాంటి ఇబ్బందులొస్తున్నాయని జిల్లా విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.


పెచ్చులూడి మీద పడుతున్నాయని పిల్లలే చెప్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భయంకరమైన పరిస్థితి. వరంగల్ అర్బన్ జిల్లాలో మొత్తం 1,031 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రైమరీ స్కూల్స్ 376, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 197, హైస్కూల్స్ 463, వీటిలో 28 స్కూళ్లు శిథిలావస్థకు చేరుకుని ఏ క్షణంలో కూలిపోతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా లో మొత్తం 692 ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 458, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 81, హైస్కూల్స్ 153 వీటిలో దాదాపు 43 పాఠశాలలు శిథిలావస్థకున్నాయి.


ములుగు జిల్లాలో మొత్తం 557 ప్రభుత్వ స్కూల్స్, వీటిలో 58 పాఠశాలలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. విద్యార్థుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడికి వెళుతున్నారు. పాములు తేళ్లతో సహవాసం చేస్తూ విద్యనభ్యసిస్తున్నారు. ప్రధానంగా ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి అత్యంత దయనీయం. కొన్ని ప్రాంతాల్లో స్కూల్ పై కప్పులు ఊడి ఏ క్షణంలో అయినా మీద పడతాయి అనిపిస్తుంది. పాఠశాలలు నల్గొండ జిల్లాలో కూడా దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: