ట్రంప్ కు ఈ మధ్య మధ్యవర్తిత్వం చేయాలనే ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి.  ఎలాగో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు.  మొన్నటి వరకు ఇరాన్, సిరియా వంటి దేశాల్లో తమ సైనికులను పంపి యుద్ధం చేశారు.  సైనికులతో పాటు ఖజానా కరిగిపోయింది.  ఒబామా ప్రభుత్వం నుంచి ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  మాములుగా జార్జ్ బుష్, జూనియర్ బుష్ లు అధికారంలో ఉండగా.. యుద్దాలు చేశారు.  ఒబామా అధికారంలోకి వచ్చిన తరువాత చాలా వరకు యుద్ధం తగ్గిపోయింది.  


బుష్ పార్టీకి చెందిన ట్రంప్ అధికారంలోకి వచ్చారు కాబట్టి.. మరలా యుద్ధం చేస్తారేమో అనుకున్నారు.  కానీ, ట్రంప్ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు.  దేశాల మధ్య సయోధ్య కుదిర్చి శాంతి చేయాలనీ చూస్తున్నాడు.  ఇందులో భాగంగానే ఇటీవలే ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మధ్యవర్తిత్వం నడిపించారు.  ఇద్దర్ని కలిపాడు.  కలిసి ఆ ఇద్దరి మధ్య కీచులాటలు మొదలయ్యాయి.  


ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆయుధాలను సమకూర్చుకోవడంలో వెనకడుగు వేయడం లేదు.  క్షిపణి వ్యవస్థను నిరంతరం పరీక్షిస్తూనే ఉన్నారు.  దీంతో ట్రంప్ ఆ దేశంపై గిర్రున ఉన్నాడు.  అటు జపాన్ కూడా ఉత్తర కొరియా చర్యలపై హెచ్చరిస్తూనే ఉన్నది.  తమ భూభాగంలోకి క్షిపణులు వస్తే..యుద్ధం తప్పదని అంటూ వార్నింగ్ ఇచ్చింది.  


ఇప్పుడు ట్రంప్ చూపులు ఇండియా, పాకిస్తాన్ పై ఉన్నాయి.  కొన్నిరోజుల క్రిత్రం ఇండియా.. పాక్ ల మధ్య మధ్యవర్తిత్వం జరపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పడంతో పెద్ద దుమారం రేగింది. ట్రంప్ ఇలా ఎలా మాట్లాడాతారని భారతీయ రాజకీయ నేతలు విరుచుకు పడ్డారు.  తరువాత ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే మరలా చేసి ఇబ్బందులో పడదు.  కాశ్మీ సమస్య ఇండియా అంతర్గత విషయం అని, బయటి వ్యక్తులతో సంబంధం లేదని ఇండియా గట్టిగా చెప్పింది.  కాగా, కాశ్మీర్ సమస్యపై ఇమ్రాన్ ఖాన్ .. ట్రంప్ కు ఫోన్ చేసి ఇండియాపై ఫిర్యాదు చేయడం.. ఇండియా దానికి వివరణ ఇవ్వడంతో హ్యాపీగా ఫలవుతున్నారు.  ఇండియా పాక్ ల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులను తొలగించానని సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: