చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోవటంతో మళ్ళీ ఈ వయసులో ప్రతి పక్షంలో కూర్చోవాల్సిన అవసరం వచ్చింది. అయితే చంద్రబాబుకు ఆరోగ్యం కూడా సరిగ్గా సహకరించడం లేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం వల్ల చంద్రబాబు ఐదేళ్లు ప్రతి పక్షంలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పాలి. ఎందుకంటే కేంద్రం ఒకే దేశం  ఒకే ఎన్నికలు దిశగా అడుగులు వేస్తుంది. అలా జరిగినప్పుడు 2022 లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంకో మూడు ఏళ్ల లోనే చంద్రబాబు మళ్ళీ ఎన్నికలకు వెళ్లొచ్చు. అయితే అప్పుడు జగన్ సర్కార్ మీద వ్యతిరేకత ఉంటే బాబుకు లాభం. లేకపోతే మళ్ళీ చంద్రబాబుకు భారీ మూల్యం తప్పదు. అయితే ఒకే దేశం  ఒకే ఎన్నికలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉందని చెప్పాలి. 


ఇది అనుకున్నంత సులభం కాదని చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం కాశ్మీర్ కు ఉన్న ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తరువాత తన నెక్స్ట్ అజెండా ఒకే దేశం — ఒకే ఎన్నికలని సంకేతాలు పంపించింది. ఇప్పటికే ఈ అంశం మీద అన్నీ రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించింది. అయితే మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ పాలనలో ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత తప్పదని చెప్పాలి. ఏ రాష్ట్రం కూడా ముందుగానే అధికారం విడిచిపెట్టి ఎన్నికలకు వెళ్లాలని అనుకోదు.


మరి ఇటువంటి విషయాన్ని బీజేపీ ఎలా డీల్ చేయబోతుందో చాలా ఆసక్తికరం. జమ్మూ కాశ్మీర్ అనేది ఒక రాష్ట్రం కాబట్టి పెద్ద సమస్య లేకుండా పోయింది. కానీ ఒకే ఎన్నికల కాన్సెప్ట్ అనేది అన్ని రాష్ట్రాలకు సంబంధించింది. అంత సులభం కాదని చెప్పాలి. ఎందుకంటే చాలా రాష్ట్రాలు ముందుగానే తమ అధికారాన్ని కోల్పోవాలని ఎవరు కోరుకోరు. కానీ కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోవచ్చు. కానీ చాలా రాష్ట్రాలు ఒప్పుకునే పరిస్థితిలో లేకపోవచ్చు. చాలా రాష్ట్రాలు బీజేపీ కంట్రోల్ లో ఉన్నప్పటికీ మరి కొన్ని రాష్ట్రాల నేతలను ఒప్పించడం కష్టమని చెప్పాలి. కానీ చెప్పలేము ఎందుకంటే అక్కడ ఉండేది బీజేపీ .. పైగా మోడీ !


మరింత సమాచారం తెలుసుకోండి: