కాలం మారిపోతోంది. పెళ్లంటే ఆడామగానే చేసుకోవాలన్న రూల్ కూడా కాలగర్బంలో కలసిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఆడాళ్లు, ఇద్దరు మగాళ్లు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. స్వలింగ సంపర్కం నేరం కాదని ఏకంగా సుప్రీం కోర్టు కూడా ఆమధ్య చెప్పేసింది. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న ఓ మహిళా జంట ఇప్పుడు పేరెంట్స్ కాబోతున్నారు.


ఇంతకీ వారు ఎవరంటారా.. ? న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీ శాటెర్త్‌వైట్, ఆమె భార్య లీ తహు. ఇద్దరూ ఆడాళ్లు దంపతులైతే.. వారిలో ఎవరిని భర్త అనాలో.. ఎవరిని భార్య అనాలో.. సహచరులు అంటే సరిపోతుందేమో.. తన సహచరి లీ తహుహు గర్భంతో ఉందని, త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీ శాటెర్త్‌వైట్ ఎనౌన్స్ చేసింది.


న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీ శాటెర్త్‌వైట్ పెళ్లి చేసుకున్న లీ తహహు కూడా అదే జట్టులో ప్లేయరే.. అమీ శాటెర్త్‌వైట్ ఆల్ రౌండర్ అయితే.. తహుహు ఫాస్ట్ బౌలర్ అన్నమాట. వీళ్లు దాదాపు 9 ఏళ్ల నుంచి సహజీవనం చేయడం విశేషం. 2017 మార్చి 2017లో పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారయ్యారు.


ఓ బేబీ రాకతో తమ జీవితంలో కొత్త అధ్యయం మొదలవబోతోందని శాటెర్త్‌వైట్ మంగళవారం ట్విట్టర్ ద్వారా ఎనౌన్స్ చేసింది. ఆ బేబీకి అప్పుడే పేరు కూడా పెట్టేశారు.. తమ ఇద్దరి పేర్లను కలిపి.. బేబీ శాటర్ హుహు అని నామకరణం చేసేశారు. ఓ బేబే ఫ్రాకును పోస్టు చేస్తూ... 2020 జనవరిలో తమ జీవితంలోకి రాబోతోందంటూ పోస్టు చేసింది శాటెర్త్ వైట్.


మరి మళ్లీ పాపే పుడుతుందని శాటర్త్ వైట్ అంత నమ్మకంగా ఎలా చెబుతుందో తెలియదు. ఇంతకీ ఇద్దరూ ఆడాళ్లే అయితే గర్భం ఎలా అని సందేహపడకండి.. ఈ టెక్నాలజీ యుగంలో బిడ్డ పుట్టడానికి మగాడితో పెద్దగా పనేముంది.. ఎన్నో ఆధునిక పద్దతులు వచ్చాయి కదా. అయితే ఏ పద్దతిలో గర్భం దాల్చిందో మాత్రం చెప్పలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: