కాశ్మీర్లో ఉగ్రవాదులు పుల్వామాలో ప్రయాణిస్తున్న ఇండియన్ ఆర్మీ వాహనాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే.  ఈ దాడిలో దాదాపు 40 మంది జవాన్లు మరణించారు.  ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి తరువాత ఇండియా ప్రతీకారంతో రగిలిపోయింది.  ఎలాగైనా బదులు తీర్చుకోవాలనుకుంది.  సర్జికల్ స్ట్రైక్స్ తరహాలోనే ప్లాన్ చేసింది.  అందుకు తగ్గట్టుగా అన్ని సిద్ధం చేసుకుంది.   ఓరోజు రాత్రి ఆపరేషన్ బాలాకోట్ ను షురూ చేసింది.  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ధ విమానాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి చొచ్చుకు వెళ్లి బాలాకోట్ పై దాడిచేశాయి.  ఈ దాడిలో వందలాది మంది జీహాదీ ఉగ్రవాదులు హతం అయ్యారు.  



అయితే, బాంబులు కేవలం అడవుల్లో చెట్లపై మాత్రమే వేసిందని పాక్ మీడియా పేర్కొన్నది.  అది నిజం కాదని ఇటీవలే పాక్ ఒప్పుకున్నది.  ఇది వేరే విషయం అనుకోండి.  ఆ మరుసటి రోజు పాక్ యుద్ధవిమానాలు ఇండియాపై దాడి చేయడానికి సిద్ధం అయ్యి భారత్ భూభాగంలోకి చొచ్చుకు రాబోయాయి.  వాటిని సైన్యం ఇండియన్ యుద్ధ విమానాలు తిప్పికొట్టాయి.  ఆ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన అభినందన్ పాక్ ఆర్మీకి దొరికిపోయాడు.  



పాక్ అతన్ని పట్టుకుంది.  అలా పట్టుకున్న వాళ్లలో పాక్ ఆర్మీలో సుబేదార్ గా పనిచేస్తున్న అహ్మద్ ఖాన్ కూడా ఉన్నారు.  ఈయన భారత్‌ - పాక్‌ సరిహద్దులో పాక్‌ నుంచి ఉగ్రవాదులను భారత్‌కు అక్రమంగా తరలించే విషయంలో కీలకంగా వ్యవహరించేవాడని తెలుస్తోంది. దీంతో పాటు జైషే మహ్మద్‌కు చెందిన సుశిక్షితులైన ఉగ్రవాదులను ఉపయోగించి  కశ్మీర్‌ లో ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచేందుకు పాక్‌ రచించే వ్యూహాలను అతడు అమలు చేసేవాడని సమాచారం. 



ఇటీవలే పాక్ చొరబాటు దారులను ఇండియాలోకి అక్రమంగా పంపే క్రమంలో న్యాకల్ సెక్టార్ లో జరిగిన కాల్పుల్లో ఇండియన్ ఆర్మీ చేతిలో అహ్మద్ ఖాన్ మరించాడు.  ఇది భారత్ కు గొప్ప విజయంగా చెప్పాలి.  ఇప్పటికి పాక్ తన బుద్దిని పోనిచ్చుకోలేదు.  అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్న పాక్ మాత్రం యథేచ్ఛగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తునే ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: