బంగారం ధరలు రోజురోజుకు పెరిగి నింగిని తాకుతున్నాయి. సామాన్యుడు శుభకార్యాలకు సైతం గోల్డ్ షాప్ ల దిక్కు చూడకుండా బెంబేలెత్తిస్తున్నాయి. ఇలానే జరిగితే ఒకప్పుడు బంగారం ఉండేది అని మధ్యతరగతి జనాలు వారి భావితరాలకు చెప్పే పరిస్థితి వస్తుంది అంటే అతిశయోక్తి లేదు. పది గ్రాముల బంగారం ధర 40000 వేలకు చేరువ అవుతుందంటే..

రోజు రోజుకు ఏ రేంజ్ లో డిమాండ్ పెరుగుతుందో తెలుస్తుంది.మంగళవారం బులియన్ ట్రేడింగ్ లో స్వచ్ఛమైన బంగారం ధర రూ. 200 పెరిగి.. రూ. 38770 వద్ద అల్ టైం రికార్డు స్థాయి ధరను నమోదు చేసింది. రోజురోజుకు తయారీదారులనుండి , వినియోగదారులనుండి డిమాండ్ తగ్గకపోవడంతో బంగారం ధర రోజురోజుకు అంతకుఅంత పెరిగిపోతుందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలావుంటే.. మరోపక్క వెండి ఏకంగా రూ. 1100 తగ్గి రూ. 43900 కు చేరింది. అంతర్జాతీయంగా పుత్తడికి అంతగా డిమాండ్ లేకున్నా భారతీయ మార్కెట్ లో వ్యాపారస్తులు, తయారీదారులనుండి అధికంగా డిమాండ్ ఉండటం.. రూపాయి బలహీనపడటం కూడా బంగారం ధర పెరగడానికి కారణమని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరతో పోలిస్తే డాలర్ బలంగా ఉండటంచేత దేశీయ మార్కెట్ లో ఈ వ్యత్యాసం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.


ఇకపోతే.. గత శనివారం నాటి ట్రేడింగ్ లో రూ. 38670 కు చేరి సరికొత్త రికార్డు నమోదు చేయగా.. నేటి బులియన్ ట్రేడింగ్ లో ఢిల్లీలో ఈ ధర రూ. 38770 కు చేరి ఆ రికార్డు బద్దలు అయ్యింది. ఈ విధమైన పెరుగుదలలతో సామాన్యుడు.. బంగారం పేరు చెబితేనే ఆమడదూరం పారిపోయే దుస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో అంతర్జాతీయంగా రూపాయి విలువ బలపడి సామాన్యుడు బంగారం కొనుక్కునే రోజులు రావాలని ఆశిద్దాం.   


మరింత సమాచారం తెలుసుకోండి: