ఏపీ రాజధాని మారబోతోందా. అమరావతి నుంచి మరోచోటికి తరలించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందా. అందుకే అక్కడ నిర్మాణ పనులన్నీ నిలిచిపోయాయయా. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజధాని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించకపోవడం కూడా ఇందులో భాగమేనా. విజయవాడ కేంద్రంగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం అంటే రాజధాని తరలింపు ఖాయమని అర్థం చేసుకోవాల. ఇదే ఇప్పుడు ఏపీలో చర్చ నీయాంశంగా మారింది.


అయితే ఈ చర్చకు తోడు ఇప్పుడు మంత్రి బొత్స స్వయంగా కొన్ని విషయాలు మాట్లాడటం, కామెంట్ చేయడం మరింత హీట్ ను పెంచుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలతో మరోసారి రాజధాని అమరావతిపై సందేహాలూ అలముకుంటున్నాయి. ప్రకటన రాకపోయినప్పటికీ ప్రభుత్వం మనసులో మాత్రం ఏదో ఉంది అన్న సందేహం మాత్రం వ్యక్తమౌతోంది. టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు మంత్రి బొత్స వ్యాఖ్యలపై స్పందిస్తూ, అవి చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు, ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని అక్కడ కట్టాలనేది వైసీపీ ప్రభుత్వానికి ఇష్టం లేదు. మొట్టమొదటి నుంచీ వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాజధాని అమరావతి మీద వాళ్లు విషం కక్కుతూనే ఉన్నారు.


ఎందుకంటే ఓ చరిత్ర కలిగిన రాజధాని అమరావతి. అమరావతి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకి మధ్యలో ఉన్నందున ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని మంచి రాజధాని కడదామంటే అప్పట్నుంచీ వెనక్కి లాగుతూనే ఉన్నారు అని ఆయన తెలిపారు. అదే విధంగా వరద నీరును ఎలాగైనా అమరావతికి తీసుకొచ్చి అది సురక్షితం కాదు అని చెప్పటానికి వైసీపీ ప్రభుత్వం చాలా ప్రయత్నించింది అని శ్రీనివాసరావ్ అన్నారు. ప్రజలకు అనువైన చోట కాకుండ వాళ్ళకు అనువైన చోట రాజధాని కట్టాలని అనుకుంటున్నారని ఆయన వివరించారు. అది చాలా దుర్మార్గమైన ఆలోచన అని ఆయన విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: