పీపీఏల ఒప్పందం కొన్ని రోజుల నుంచి నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఒక పక్క కేంద్రం వద్దని చెబుతున్న జగన్ మాత్రం వినడం లేదు. ఇప్పటికే దీని మీద టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అదేదో అపరాధం మాదిరి కలరింగ్ ఇస్తున్నారు. అయితే జగన్ పీపీఏ పునః సమీక్ష వెనుక రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పటీకే రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు వేలకోట్లు బకాయిలు కట్టాల్సిన పరిస్థితి. దీనిని భరించాలంటే ప్రజల మీద భారాన్ని మోపాలి. కానీ జగన్ కు ప్రజలను ఇబ్బందే పెట్టే పని చేయకూడదని నిర్ణయించుకున్నారు. కానీ కేంద్రం మాత్రం పీపీఏల జోలికి పోవద్దని వారిస్తుంది. రాష్ట్రం కష్టాల్లో ఉంది అంటే కేంద్రం నిధులు ఇవ్వదు కానీ ఇటువంటి అడ్డ పుల్లలు వేయడానికి మాత్రం ముందు ఉంటుంది.


అయినా అవినీతి ఒప్పందాలు పునః సమీక్షించితే పెట్టుబడులు ఎలా ఆగిపోయితాయో కేంద్రమే చెబితే బాగుండు. ఇప్పటికే రాష్ట్రం ప్రభుత్వం విద్యుత్తు డిస్కంలకు సుమారు 21000 అప్పు ఉంది. ఇంత పెద్ద మొత్తాన్ని తగ్గించుకోవాలంటే విద్యుత్ చార్జీలు పెంచాల్సిన పరిస్థితి. అయితే జగన్ ప్రభుత్వం చెబుతున్న మాట ఏంటంటే .. పీపీఏల ఒప్పందం పారదర్శకంగా జరిగి ఉంటే రాష్ట్రం మీద ఇంత అప్పు ఉండేది కాదని.


ఇప్పుడు ఏపీ ప్రభుత్వం డిస్కం లకు 18,500 కోట్లు బకాయిలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా యూనిట్ విద్యుత్ ధర సుమారు రూ 5.50  పైగా కొనుగోలు చేయడంతో రాష్ట్రం మీద అప్పు కుప్పలుగా వచ్చి చేరింది. నిజానికి పక్క రాష్ట్రాల్లో  రూ.2 నుంచి రూ. 3 ఉంటే .. ఏపీలో మాత్రం చాలా ఎక్కువగా ఉంది.  దీనితో జగన్ తప్పని పరిస్థితిలో పీపీఏ ల పునః సమీక్షకు పట్టు బడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: