పరిస్ధితి చూస్తుంటే అలాగే ఉంది తెలుగుదేశంపార్టీలో.  మొన్నటి ఎన్నికల్లో టిడిపికి ఘోర పరాజయం ఎదురైన సంగతి అందరికీ తెలిసిందే.  చంద్రబాబునాయుడు నాయకత్వ సత్తా ఏంటో అందరికీ తెలిసిపోయింది. దాంతో చంద్రబాబు నాయకత్వం మీద చాలామందిలో నమ్మకం పోయింది. అదే సమయంలో చంద్రబాబుకు వయసైపోవటం, చినబాబు లోకేష్ సామర్ధ్యం ఏంటో అందరికీ తెలిసిపోవటంతో చాలామంది పార్టీకి రాజీనామా చేసేస్తున్నారు.

 

ఇక్కడ కొందరిలో సమస్యలు మొదలయ్యాయి.  పార్టీలో ఇపుడు సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఎవరంటే గెలిచిన ఎంఎల్ఏలని చెప్పటంలో సందేహమే అవసరం లేదు. మొన్నటి ఎన్నికల్లో తమను తాము చాలా పెద్ద నేతలమని అనుకుంటున్నవాళ్ళలో కూడా చాలామండి ఓడిపోయారు. చివరకు ముక్కీ మూలిగి చంద్రబాబుతో కలిపి 23 మంది గెలిచారు.

 

ఇపుడు వాళ్ళ సమస్య ఏమిటంటే పార్టీలో ఉండలేరు అలాగని బయటకు రాలేరు. టిడిపి భవిష్యత్తుపై ఎవరిలోను నమ్మకం లేని ఈ పరిస్ధితుల్లో పార్టీని వదిలేసి బయటకు రావాలంటే ముందు రాజీనామాలు చేయాల్సిందే. వైసిపిలో చేరాలంటే జగన్ గేట్లు తెరవలేదు. కాబట్టి పార్టీ మారాలని అనుకుంటున్న నేతలకు టిడిపి ఒక్కటే ప్రత్యామ్నాయంగా మారింది.

 

ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేస్తే వచ్చే ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిచేది అనుమానమే. ఎందుకంటే ఉపఎన్నికలు జరిగితే మళ్ళీ వైసిపి, టిడిపి, బిజెపి, జనసేన, కాంగ్రెస్ అన్నీ పార్టీలు పోటి పడతాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఊపుముందు మిగిలిన పార్టీల అభ్యర్ధులు గెలిచేది అనుమానమే. ఇందుకే ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేసి టిడిపి నుండి బయటకు రావటానికి ఎవరూ ఇష్టపడటం లేదు.

 

అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వారు మాత్రం టిడిపికి రాజీనామా చేసేసి హ్యాపీగా  బిజెపిలో చేరిపోతున్నారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయలేక అలాగని ధిక్కరించ లేక ఇబ్బందులు పడుతున్నారు. అనర్హత వేటు అడ్డుపడకపోతే ఈపాటికి సుమారు ఓ 18 మంది ఎంఎల్ఏలన్నా పార్టీని వదిలేసేవారే అనటంలో సందేహమే లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: