ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డ్ సచివాలయాలలో 1,26,728 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 11 వ తేదీ వరకు మూడు కేటగిరీలలోని వివిధ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుండి ధరఖాస్తులు స్వీకరించారు. ఈ నెల 25 వ తేదీ నుండి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని తెలుస్తుంది. ధరఖాస్తు చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ధరఖాస్తు చేసిన అభ్యర్థులకు వీలైనంత వరకు 30 కిలోమీటర్ల దూరంలోనే పరీక్ష కేంద్రం కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. 
 
సొంత మండలంలో అభ్యర్థులకు పరీక్ష కేంద్రం కేటాయించకుండా పక్కనే ఉన్న మరొక మండలంలో పరీక్ష కేంద్రం కేటాయించాలని నిబంధన పెట్టినట్లు సమాచారం. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలు మెరిట్ అభ్యర్థులు పొందటమే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమని పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ధరఖాస్తు చేసిన అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల ఏర్పాటు పూర్తయిందని గిరిజా శంకర్ తెలిపారు. 
 
రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగ నియామకాలు ఉండబోతున్నాయని స్పష్టం చేసారు. ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే పరీక్ష కేంద్రాలకు ఇన్విజిలేటర్లుగా నియమించబోతున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వీడియో కెమెరాలను ఉపయోగించి షూట్ చేయటం జరుగుతుంది. రాత పరీక్ష ఫలితాలలో మార్పులు చేర్పులకు అవకాశం ఉండదని తెలుస్తోంది. 
 
ఒక అభ్యర్థికి ఒకే రోజు రెండు పరీక్షలు ఉంటే ఒకే పరీక్ష కేంద్రం ఇచ్చేలా చర్యలు తీసుకొన్నట్లు సమాచారం. పరీక్షకు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరని తెలుస్తోంది. అంధులు, రెండు చేతులు లేని వారికి సహాయకుడిని నియమించటంతో పాటు 50 నిమిషాల సమయాన్ని అదనంగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్థులు అక్టోబర్ 2 వ తేదీ నుండి విధుల్లో చేరాల్సి ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: