ఈ మధ్యకాలంలో మనిషి ప్రాణానికి అసలు విలువలేదు.కోపం వస్తే చాలు ఎంతకైన తెగిస్తున్నారు.లేదంటే ప్రాణాలు తీస్తు న్నారు.అది కట్టుకున్న వారైన,కన్నవారైన,లవర్స్ ఐనా,చివరికి ఇల్లీగల్ ఎఫైర్స్ వున్నవారైనా క్షణం కూడ ఆలోచించడం లేదు,నవ్వుకోవాలో,బాధపడి ఆలోంచిచాలో తెలియని సంఘటన ఇలాంటిదే ఒకటి జరిగింది.. నిద్ర పట్టినివారు కంటినిండ నిద్ర ఎలాపోవాలో ఆలోచిస్తారు,కాని ఆ నిద్రే ప్రాణం తీసేలా వుంటుందని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు.కాని గాఢ నిద్ర ఆ వ్యక్తి ప్రాణం తీసేంత పని చేసింది.కొత్తసుఖాల రుచి చూపిస్తా వచ్చేయ్ అని ప్రియురాలిని రొమాంటిక్‌‌గా ఇంటికి పిలిచి నిద్రలోకి జారుకున్న ఆ ప్రియుడిపై ఆమె ఇలా పగ తీర్చుకుంది.అమెరికాలోని న్యూ జెర్సీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.




తైజా రస్సెల్ అనే మహిళ ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుంది.అతడు రస్సెల్‌‌ను తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి పిలి.సెక్స్ చేసుకుందామని ఆశపెట్టాడు.ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత అతడు తలుపులు తీయకుండా కుంభకర్ణుడిలా నిద్ర పోయాడు.అప్పటికే గాఢ నిద్రలో ఉండటంతో కాలింగ్ బెల్ కొట్టినా,తలుపులు తట్టినా లేవలేదు. ఫోన్ చేసి నిద్ర లేపేందుకు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది.దీంతో ఆమె కోపం తీవ్రమై,నషాలానికి అంటింది అది ఎంతలా అంటే అతడిని ఆ ఇంట్లోనే బంధించి తగలబెట్టేంత వెంటనే,సమీపంలో ఉన్న గ్యాస్ స్టేషన్‌కు వెళ్లి ఇంధనం కొనుగోలు చేసి దాన్ని అతడి ఇంటి చుట్టూ చల్లి నిప్పంటించి పారిపోయింది..




ఇల్లంత పొగపొగ వాసన వస్తూ ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడంతో బాధితుడు నిద్ర లేచి.కళ్లు తెరిచి చూసేసరికి ఇంటి చుట్టూ దట్టమైన పొగ, మంటలు. తప్పించుకుందామంటే ఆమె బయట నుంచి తలుపులకు గడియపెట్టేసింది.దీంతో కిటికీ తలుపులు పగలగొట్టి పరుగులుపెట్టాడు.భయంతో వుడ్‌బ్యూరీ పొలీస్ స్టేషన్‌కు వెళ్లి..ఎవరో తన ఇంటికి నిప్పు పెట్టారని చెప్పాడు.దీంతో పోలీసులు హుటాహుటిన అతడి ఇంటికి చేరుకుని అగ్నిమాపకసిబ్బందిసాయంతో మంటలుఅద్దుపులోకి తెచ్చినతర్వాత అతనిఎదురుగావున్న సీసీటీవీ కెమేరాలను పరిశీలించారు.అందులో కనిపించే వీడియోలను చూసి బాధితు డిని పిలిచి ఆ వీడియోలో కనిపిస్తున్నది ఎవరు,ఆమె మీకు తెలుసా? అని అడిగారు.కాస్త తడబడుతూ ఆమెను తెల్లవారు జామున 4 గంటలకు ఇంటికి రమ్మని  పిలిచానని,ప్రమాదం సమయానికి ఆమె కనిపించలేదని.అసలు విషయం చెప్పాడు.



దీంతో పోలీసులు రస్సెల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.‘‘సెక్స్ చేసుకుందాం,4 గంటలకు వచ్చేయమని చెప్పాడు. రాత్రంతా నిద్ర మానుకుని ఇంటికెళ్తే.. నిద్రపోయాడు.అందుకే ఇల్లు తగలబెట్టేశా’’అని చెప్పింది.పోలీసులు ఆమెపై హత్యా యత్నం కేసునమోదు చేశారు. బాధితుడు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.చిత్రం ఏమిటంటే.ఏప్రిల్ నెలలో ఇదే ప్రాంతంలో మరో మహిళ కూడా ఇలాగే ఓ వ్యక్తిని ఇంట్లోబంధించి నిప్పుపెట్టిందట.వరుస ఘటనలతో అక్కడి పోలీసులు‘ఇదేం ట్రెండ్‌ రా బాబు అని,తలలు పట్టుకుంటున్నారట... 


మరింత సమాచారం తెలుసుకోండి: