ఒక్కసారి ఓ మూడు నెలల కాలం వెనక్కి వెళ్లండి.. అప్పటి చంద్రబాబు ఎన్నికల ప్రచారాలను పరిశీలించండి.. మోడీ సర్కారు ఈవీఎంలను మేనేజ్ చేస్తోందహో.. అంటూ చంద్రబాబు ఎంత గగ్గోలు పెట్టారో గుర్తు తెచ్చుకోండి.. ఎన్నికల ముందే కాదు.. పోలింగ్ తర్వాత కూడా అంతా హాయిగా రెస్టు తీసుకుంటుంటే.. చంద్రబాబు మాత్రం ఈ సీ పోరాటానికి ఎనలేని కృషి చేశారు.


మొత్తం 21 పార్టీలను కూడగట్టి ఈ సీ పై యుద్ధానికే వెళ్లారు. ఎన్నికల ముగిసినా రోజూ ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఈసీ నా నేనో తేలిపోవాలి అంటూ హుంకరించారు. అయితే ఇప్పడు అదంతా ఎందుకు అంటారా.. ఎందుకంటే.. అదే చంద్రబాబు ఇప్పుడు ఈసీపై నోరెత్తడం లేదు. అరే ఎన్నికలు లేవు కదా ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఏముంది అంటారా.. ఓకే.. ఓకే.. కానీ ఇదే అంశంపై ఎవరైనా పోరాడుతుంటే మద్దతు అయినా ఇవ్వాలి కదా.. కనీసం ఆ పోరాడేవారు ఆహ్వానం పలుకుతుంటే.. తానూ ఓ అడుగు వేయాలి కదా.. కానీ ఇప్పుడు చంద్రబాబు అలాంటి పనులేవీ చేయడం లేదట.


ఇటీవల మహారాష్ట్ర కు చెందిన నవ నిర్మాణ సేన అధినేత రాజ్ ధాకరే ముంబైలో జరప తలపెట్టిన ఒక సదస్సుకు చంద్రబాబును ఆహ్వానించాలని ప్రయత్నించారట. దీనికి సంబంధించి ఆయన ఒక గ్రూప్ ను కూడా ఆయన తయారు చేస్తున్నారట. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వంటివారు కూడా కొన్ని కార్యక్రమాలకు వెళ్లి వచ్చారు. గతంలో చంద్రబాబు ఎలాగూ ఈ విషయంలో ఛాంపియన్ కాబట్టి ఆయన్ని కూడా పిలుద్దామని ట్రై చేశారట.


చంద్రబాబు తో మాట్లాడాలని.. ఆయన అప్పాయింట్ మెంట్ తీసుకోవాలని పాపం రాజ్ థాకరే చాలా ప్రయత్నం చేశారట. కానీ చంద్రబాబు ఎంతకీ చంద్రబాబు ఫోన్‌లో అందుబాటులోకి రావడం లేదట. దీంతో విసిగిపోయిన రాజ్‌ థాకర్ ఇక లాభం లేదు.. ఎవరినైనా వ్యక్తిగతంగా పంపి చంద్రబాబు ఉద్దేశం తెలుసుకోవాలని భావిస్తున్నారట. ఒకప్పుడు ఈవీఎంలపై పోరాటం తన పేటెంట్ హక్కుగా భావించిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు సైలంట్ అయ్యారో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: