గత నెల 22 వ తేదీన భారత్ ఓ చరిత్రకు శ్రీకారం చుట్టింది.  ఎవరు చేరుకోలేని చోటికి చంద్రయాన్ 2 ను పంపేందుకు సిద్ధం అయ్యింది.  భారత్ ప్రయోగించిన మార్క్ 3 రాకెట్ చంద్రయాన్ 2 ను తీసుకొని నింగిలోకి ఎగిరింది.  అతి తక్కువ ఖర్చుతో చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రపంచం దృష్టి మొత్తం ఇండియాపై ఉన్నది.  ఇప్పటి వరకు అందరు చంద్రుని మధ్య భాగం మీదకు మాత్రమే ఉపగ్రహాలను పంపించారు. పరిశోధన చేశారు.  


దక్షిణ దృవ ప్రాంతం మీదకు ఉపగ్రహాలను పంపి పరిశోధన చేయాలని చాలా దేశాలు ప్రయత్నించాయి. వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశాయి.  ఆయా దేశాలకు సాధ్యం కాలేదు.  మొదటిసారి ఇండియా ప్రయోగించిన చంద్రయాన్ 2 సక్సెస్ ఫుల్ గా సెప్టెంబర్ 7 వ తేదీన చంద్రుని దక్షిణ దృవంపై అడుగుపెట్టబోతున్నది. అసలు చంద్రుని దక్షిణ దృవం మీదకు ఎందుకు చంద్రయాన్ 2 ను పంపించాలని అనుకుంది.  అక్కడే పరిశోధన ఎందుకు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. చూద్దాం.  


బిలియన్ సంవత్సరాలుగా చంద్రుని దక్షిణ దృవంపై సూర్యరశ్మి చేరుకోలేని బిలాలు ఎన్నో ఉన్నాయి.  ఈ బిలాల నీడలో దాదాపు 100 మిలియన్ టన్నుల నీటి నిల్వలు ఉన్నట్టు అంతరిక్ష పరిశోధకులు అంచనా వేస్తున్నారు.  ఒకవేళ ఈ నీటి నిల్వలు ఉన్నది వాస్తవమే అయితే.. వాటిని ఎలా వినియోగంలోకి తీసుకోవాలో ప్రయోగాలు జరుగుతాయి.  దీంతో పాటు, దక్షిణ దృవం ఉపరితలంపై పొరల్లో హైడ్రోజన్, అమ్మోనియా, మీథేన్‌, సోడియం, మెర్క్యూరీ, వెండి లాంట మూలకాల ఉన్నాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.  


ఈ మూలకాలు ఉన్న మాట వాస్తవమే అయితే.. వాటిపై పరిశోధనలు చేసి వాటిని భారతదేశం ఎలా వినియోగంలోకి తీసుకురావాలో పరిశోధనలు జరుగుతాయి.  వీటిని అక్కడి నుంచి ఇండియాకు తీసుకు రాగలిగితే... ఇండియా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మారుతుంది.  అంతేకాదు, ఆ దక్షిణ దృవం మీదకు అడుగుపెట్టబోతున్న మొదటి దేశం ఇండియానే కాబట్టి దానిపై పట్టు సాధించే అవకాశం ఉంటుంది.  పైగా రాబోయే రోజుల్లో చంద్రుని మజిలీగా చేసుకొని ప్రయోగాలు చేయడానికి ఇండియా ప్రయత్నాలు చేస్తోంది.  అక్కడ నీటి నిల్వలు ఉంటె ఆవాసయోగ్యంగా మార్చుకోవడానికి కృత్రిమ నివాసాలు ఏర్పాటు చేసుకోవానికి కావలసిన మార్గాలను అన్వేషించానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: