తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారుల‌కు కీల‌క ఆర్డ‌ర్ వేశారు. సుదీర్ఘంగా నిర్వ‌హించిన క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో మంత్రులు, క‌లెక్ట‌ర్ల నోటికి తాళం వేసేశారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం తొమ్మిదిన్నర గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సమావేశానికి 33 జిల్లాల కలెక్టర్లతోపాటు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, వివిధ శాఖల కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురపాలక, పంచాయతీరాజ్‌చట్టాల అమలుపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అయితే, ఈ స‌మావేశం విష‌యాలు ఏవీ బ‌య‌ట‌కు పొక్క‌ద్ద‌ని కేసీఆర్ ఆర్డ‌ర్ వేసేశారు.


కేసీఆర్‌‌‌‌ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లా కలెక్టర్లతో సమావేశం కావడం ఇదే తొలిసారి. సాధారణంగా సీఎం సమావేశాల తర్వాత సీఎంవో నుంచి ప్రెస్‌‌‌‌నోట్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేస్తుంటారు. కానీ ఈ భేటీ తర్వాత ఎలాంటి నోట్​ రిలీజ్​ కాకపోవడం విశేషం.రెవెన్యూ చట్టంపై త్వరలో తానే మీడియా ముందుకు వస్తానని సీఎం అన్నట్టు తెలిసింది. స‌మావేశంలో ఏం మాట్లాడాం, రెవెన్యూ చట్టంలో ఉండబోయే అంశాలేంటి, ఇతర విషయాలేవీ ఎవరితోనూ చర్చించవద్దని మంత్రులు, కలెక్టర్లను కేసీఆర్‌ ఆదేశించినట్టు సమాచారం.  దీంతో మీటింగ్‌‌‌‌ ముగిశాక ఏ ఒక్క మంత్రిగానీ, అధికారి గానీ ఎవరితోనూ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అధికారులకు ఫోన్లు చేసినా ఎవరూ లిఫ్ట్‌‌‌‌ చేయలేదు. 


ఇక  కొత్త పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలను సమర్థంగా అమలుచేయడం ద్వారా పట్టణాలు, పల్లెప్రాంతాల అభివృద్ధికి దోహదపడాలని కోరారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రైతులు భూ యాజమాన్య హక్కుల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వాటిని ఎలా పరిష్కరించాలి? కొత్తగా రూపొందించే చట్టంలో ఏ అంశాలను ప్రధానంగా తీసుకోవాలి? అనే అంశాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఈ విషయాల్లో కలెక్టర్ల నుంచి విస్తృతస్థాయిలో అభిప్రాయాలను సీఎం తీసుకున్నారని తెలిసింది. జిల్లాలవారీగా పట్టణాలు, గ్రామాల్లో సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపైనా కలెక్టర్లతో సీఎం చర్చించినట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: