ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా దొంగతనాలు పెరిగిపోతున్నాయి. బయటి దొంగల కంటే పరిచయం ఉన్నవారో, ఇంట్లో పని చేసే వారో దొంగలుగా పట్టుబడుతున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. యజమాని తెలివిగా వ్యవహరించటంతో ఇంట్లో పని చేసే దొంగను పోలీసులు పట్టుకున్నారు.  
 
హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో భీంరెడ్డి పటేల్ నివశిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా భీంరెడ్డి పటేల్ ఇంట్లో పెట్టే డబ్బులు రోజూ పోతున్నాయి. కానీ భీంరెడ్డి పటేల్ కు డబ్బులు ఎవరు దొంగలిస్తున్నారో అర్థం కాలేదు. వరుసగా ఇంట్లోని డబ్బులు పోతూ ఉండటంతో ఒక తెలివైన ప్లాన్ వేసాడు భీంరెడ్డి పటేల్. ఇంట్లో పెట్టబోయే నోట్ల యొక్క నంబర్లు ముందుగానే రాసుకున్నాడు భీం రెడ్డి పటేల్. 
 
ఎప్పుడూ డబ్బులు దాచే చోట 2,100 రుపాయలు ఉంచాడు భీంరెడ్డి పటేల్. డబ్బులు పెట్టిన కొద్ది సమయంలోనే ఆ డబ్బులు అక్కడినుండి మాయమయ్యాయి. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేసాడు. పోలీసులు రంగంలోకి దిగి ఇంట్లోని పనివారినందరినీ విచారించారు. విచారణలో భీంరెడ్డి ఇచ్చిన నెంబర్లతో మ్యాచ్ అయిన నోట్లను పనిమనిషి అఖిల దగ్గర గుర్తించారు పోలీసులు. 
 
పోలీసులు ప్రశ్నించటంతో అఖిల నేరం తానే చేసినట్లు అంగీకరించింది. ఈమె పూర్తి పేరు ఉప్పరి అఖిల. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 10లోని బస్తీలో ఈమె నివాసం ఉంటోంది. ఆరు నెలల క్రితం ఈమె భీంరెడ్డి పటేల్ ఇంట్లో పనిలోకి చేరింది. పోలీసులు ఈమె నుండి 16,500 రుపాయలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమెను రిమాండ్ కు తరలించినట్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ డీఐ శివ కుమార్ తెలిపారు 


 



మరింత సమాచారం తెలుసుకోండి: