మహనగరాలను పట్టిపీడుస్తున్నసమస్యల్లో ముఖ్యంగా ఉగ్రవాదం,డ్రగ్స్,వ్యభిచారం.ఇవి ఎప్పుడు ఏ పద్దతిలో ఎక్కడ జరుగుతాయో తెలియదు.ఇక వ్యభిచారమైతే అన్నాచెళ్లలని, భార్యభర్త లని,చుట్టాలని చెప్పుకుంటు పెద్దపెద్ద అపార్ట్‌మెంట్స్ అద్దెకుతీసుకుని నిర్వహిస్తుంటారు నిర్వాహకులు,అంతే కాకుండా హైటెక్ వ్యభిచారంలో,మొబైల్ వ్యభిచారం, ఆన్లైన్  కాంటాక్ట్స్ ,గ్రూప్ మెసెజస్,ఇలా ఎన్ని దారులుంటే అన్నిదారుల్లో తమ తెలివితేటలు ఉపయోగించి విటులను  ఆకర్శిస్తు న్నారు.ఒకప్పుడు ఊరిచివర్లో జరిగే ఈ పనులు ఇప్పుడు అక్కడ ఇక్కడ అనే తేడ లేకుండా అంతట జరుగుతున్నాయి.ఇది చట్టవిరుద్దమైనప్పటికి ఎవరు భయపడటం లేదు.




ఇక ఈ సిటిలో అమీర్‌పేట్అంటే తెలియనివారుండరు.ఇక్కడ తమ బిజినెస్ బ్రహ్మాండగా సాగుతుందని వ్యభిచారదందపై ఎన్నిసార్లు దాడులు జరిగిపిన ఒంట్లో భయంఅనేది లేకుండా, మరోసారి స్టార్ట్ చేసారు నిర్వాహకులు.వివరాల్లోకి వెళ్లితే హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతమైన అమీర్‌పేటలో హైటెక్ పద్ధతిలో నిర్వహిస్తున్న వ్యభిచారదందాను పోలీసులు గుట్టురట్టు చేశారు.అమీర్‌పేటలోని ధరమ్‌కరమ్ రోడ్డులోని ఓహోటల్‌ లో కొంతకాలంగా వ్యభిచారం గుట్టచప్పుడు కాకుండా జరుగుతోంది.కలిసి నిర్వహిస్తున్నవారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరానికి చెందిన నాని అలియాస్‌ జోగేశ్వర్‌, అరవన్‌,హోటల్‌ మేనేజర్‌ ప్రేమ్‌ అని తెలిసింది.



ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వారితో సోషల్‌ మీడియా ద్వారా విటులను  ఆకర్షించి వ్యభిచారం చేయిస్తూ హోటల్‌లోనే దందా సాగిస్తున్నారు.హోటల్‌లో బస చేసేందుకు వచ్చే వారికి కూడా అమ్మాయిలు కావాలా? అంటూ ఆఫర్లు ఇస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది రాత్రి ఆకస్మికంగా దాడి చేసి రెడ్‌ హాండ్‌గా పట్టుకున్నారు..నాని,ప్రేమ్‌తో పాటు ఇద్దరు యువతులను అరెస్ట్ చేయగా,మరో నిర్వాహకుడు అరవన్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోగా అదుపులోకి తీసుకున్న వారిని విచారణ నిమిత్తం ఎస్.ఆర్.నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారట..




ఇప్పటికే సవాలక్ష సమస్యలతో సతమతమౌతున్న పోలీస్ డిపార్ట్‌మెంట్ వారికి ఈ వ్యభిచారం ఓ తలనొప్పిగా మారిందని వాపోతున్నారు.ఎక్కువగా స్టూడెంట్స్,సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు,ఇతరులు వివిధ ప్రదేశాలనుండి వచ్చిన వారు ఎక్కువగా వుండే ప్రాంతం కావడంతో నిత్యం ఈ ప్రదేశం జనంతో కిటకిటలాడుతు వుంటుంది.అందుకే అసాంఘిక కార్యకలాపాలకు అనువైన ప్రదేశం అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: