ఎల్లోమీడియా వ్యవహరం భలే విచిత్రంగా ఉంటుంది. చంద్రబాబునాయుడు మెప్పుకోసం ప్రత్యర్ధులపై ఎంతటి బురద చల్లటానికైనా వెనకాడదు. తాజాగా ఆ విషయం మరోసారి రుజువైంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పరిశ్రమలు రావటానికి ఇబ్బందిగా మారిందని ఎల్లోమీడియా తెగ బాధపడిపోతోంది. ఇందులో భాగంగానే ఏపికి రావాల్సిన  భారీ పరిశ్రమలు వెళిపోతున్నట్లు తప్పుడు కథనాలను వండి వారుస్తోంది. గుడ్డకాల్చి మీద వేసేయటమే వీళ్ళ టార్గెట్.

 

అయితే ఎల్లోమీడియా ఓ విషయం మరచిపోయినట్లుంది. అదేమిటంటే చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి వచ్చిన భారీ పరిశ్రమలు ఎన్ని ? జగన్ సిఎం అయిన తర్వాత ఏపి నుండి తరలి వెళ్ళిపోయిన పరిశ్రమలు ఎన్ని ? ఈ ప్రశ్నలకు మాత్రం ఎల్లోమీడియా సూటిగా సమాధానం చెప్పదు. ఎందుకంటే వాళ్ళదగ్గర సమాధానం లేదు కాబట్టి.

 

సిఎంగా చంద్రబాబు ఉన్న ఐదేళ్ళ కాలంలో చెప్పుకోదగ్గ పరిశ్రమ అంటే అనంతపురంలో వచ్చిన ఒక్క కియా కార్ల ఉత్పత్తి పరిశ్రమ మాత్రమే. సరే ఈ క్రెడిట్ లో కూడా బిజెపి వాటా కోరుతున్న విషయం తెలిసిందే. కియా పరిశ్రమ తప్ప చెప్పుకోవటానికి కూడా మరో పరిశ్రమ రాలేదు చంద్రబాబు వల్ల. కానీ పెట్టుబడులను ఆకర్షించటం, పారిశ్రామికవేత్తలతో సమావేశాల పేరుతో చంద్రబాబు ఎన్ని దేశాలు తిరిగారో ? ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో అందరికీ తెలిసిందే.

 

ఇక జగన్ సిఎం అయిన ఈ రెండు నెలల్లో ఒక్క పరిశ్రమ కూడా ఏపి నుండి బయటకు వెళ్ళింది లేదు. ప్రభుత్వంలో పారదర్శకత కోసం, అవినీతి రహిత పాలన కోసం జగన్ తపిస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని, తిరిగి ఆ పరిస్ధితి రాకుండా చూడాలని కోరుకుంటున్నారు. ఇందుకే ఎల్లోమీడియా గగ్గోలు పెట్టేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: