తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి ఆలోచించే పనిలో పడ్డారు. దీని కోసం ఆయన తెలంగాణ రష్ట్రమంతటా పర్యటన చేయనున్నారు. ఇందుకు కాను రెండోవ రోజు పర్యటనకుకూడా సీఎం కేసీఆర్ సిద్ధమైయ్యారు.  కాసేపట్లో సీఎం కేసీఆర్ కలెక్టర్ లతో కలిసి కోమటిబండకు వెళ్లనున్నారు. నిన్నటి పర్యటనలో  అన్ని జిల్లాల కలెక్టర్ లతో సమావేశం అయ్యారు సీఎం కేసీఆర్.

కొత్త చట్టంతో పాటు మూడు ముఖ్యమైన అంశాలపైనా కలెక్టర్లతో చర్చించారు. రెండో రోజు సమావేశాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన కు వెళ్లి అక్కడ సమావేశాలు నిర్వహించనున్నారు ఇందు కోసం తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో కలెక్టర్ లతో కలిసి పర్యటించునున్నారు. ముఖ్యంగా కోమటిబండలో నిర్మించే గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద పలువురు మంత్రులు రాష్ట్రం లో ముప్పై మూడు జిల్లాల కలెక్టర్ లతో సమావేశం కానున్నారు. గజ్వేల్ నియోజకవర్గం లో చేపట్టిన హరితహారం మిషన్ భగీరథ పనుల గురించి సీఎం వివరించ నున్నారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా గజ్వేల్ ను మోడల్ గా తీసుకొని అభివృద్ధి చేయాలని కలెక్టర్ లకు సలహాలు సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం. సీఎం పర్యటన నేపథ్యం లో ఇప్పటికే అధికారులు ఏర్పాట్ లను పూర్తి చేశారు.ఈ పర్యటన తెలంగాణ రాష్ట్ర అభివృద్ఢి కొరకు కేసీఆర్ జిల్లా కలక్టర్లతో కలిసి పెద్ద ఎత్తున సమావేశం అవ్వనున్నారు. రిజర్వాయర్లు, ఇంకా రాష్ట్ర అభివృద్ఢి నిమిత్తం ఏమేమి కావాలో,వారు ఊర్లు అభివృద్ఢి చెందేందుకు ఆయన ప్రవేశపెట్టిన పధకాలను అమలు చేసే కార్యక్రమంలో ఉన్నారు మన తెలంగాణ ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా గజ్వేల్ పైనే పెట్టనున్నారు.

గజ్వేల్ తెలంగాణలోనే ఒక అభివృద్ఢి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు మన కేసీఆర్. మిషన్ భగీరథ పనులు ఇప్పటికే కొన్ని చోట్ల చాలా మెరకు పూర్తి అయ్యే దశలో ఉన్నందున దీని పై కూడా ఆయన ఈ సమావేశంలో చర్చించనున్నారు.ఈ చర్చలు ముగిసిన అనంతరం ఆయన ఏ నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: