అమిత్ షా ఇపుడు దేశంలోనే అత్యంత బలవంతుడు. ఆయన తలచుకుంటే ఏదైనా చేయగలరు, తెలుపు షర్ట్ కు నలుపు రంగు పడిపోతుందంతే. ఇక అమిత్ షా దెబ్బ అంటే ఇదీ అని నిరూపించే ఘటన లేటెస్ట్ గా జరిగింది. ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇది ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది. అసలే ఓటమి దెబ్బతో కునారిల్లిన కాంగ్రెస్ కి మరిన్ని కష్టాలు తెప్పించే పరిణామాలు జరుగుతున్నాయి. అమిత్ షా దెబ్బకు ఇపుడు కేంద్ర మాజీ  హోం మంత్రి చిదంబరం పరార్ అయ్యారు.


ఇదే చిదంబరం దాదాపు పదేళ్ళ క్రితం దేశంలోనే అతి పెద్ద బలవంతుడుగా కనిపించారు. ఆయన ఆనాడు కేంద్ర హోం మంత్రిగా ఉంటూ ఓ స్థాయిలో చక్రం తిప్పారు. అల ఇలా కాదు, నచ్చని వారి మీద సీబీఐ ప్రయోగించి మరీ జైలు దారి చూపించారు. ఇక చీకట్లో చిదంబరాన్ని చంద్రబాబు కలిసిన మీదటనే ఏపీలో జగన్ని కటకటాల వెనక్కి నెట్టగలిగారు. ఆయన మీద సీబీఐ ప్రయోగించి మరీ 17 నెలల పాతు బెయిల్ కూడా ఇవ్వకుండా మ్యానేజ్ చేశారని కూడా చెబుతారు. 


ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు అవినీతి ఆరోపణల మీద  చిందంబరం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అనేక కేసుల్లో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న చిదంబరంపై తాజాగా ఈడీ దాడికి దిగింది. అరెస్ట్‌ను ముందే పసిగట్టిన ఆయన ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బెయిలును నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడంతో నిన్న  రాత్రికే సీబీఐ, ఈడీ అధికారులు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి చేరుకున్నారు. దాంతో దెబ్బకు చిదంబరం ఇంటి నుంచి పరార్ అయ్యారు.


ఇక ఈ రోజు తెల్లారుతూనే  కూడా మరోసారి ఈడీ అధికారులు చిదంబరం ఇంటికి వెళ్ళారు. అయినా ఆయన జాడ లేదు, సుప్రీం కోర్టు ద్వారా స్టే తెచ్చుకోవడానికి చిదంబరం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ అక్కడ కూడా స్టే రాకపోతే ఆయనకు ఇబ్బందులు తప్పవు. అపుడు చిదంబరం అరెస్ట్ తప్పదని అంటున్నారు. ఈ పరిణామాల వెనక అమిత్ షా ఉన్నారని, ఇది పూర్తిగా పొలిటికల్ రివెంజ్ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 


చిందంబరం హోం మంత్రిగా ఉన్నపుడు సొహబుద్దీన్ కేసులో అమిత్ షాని అరెస్ట్ చేయించి మూడు నెలల్లు జైల్ల్లో పెట్టించారు. అప్పటికి ఆయన గుజరాత్ హోం మంత్రి. మరి ఆ తరువాత అవకాశం కోసం చూసిన అమిత్ షా ఇపుడు దేశానికే హోం మంత్రి అయ్యారు. తన ప్రతాపం ఇలా చూపించారని, ఫలితంగా చిదంబరానికి చిక్కులు వచ్చాయని అంటున్నారు. మరి ఒక్క రోజు అయినా చిదంబరం చేత   జైలు వూచలు లెక్కబెట్టించాలనుకుంటున్న షా ఎత్తులు ఫలిస్తాయా... వెయిట్ అండ్ సీ.


మరింత సమాచారం తెలుసుకోండి: