వరదలు వచ్చింది మొదలు వరద వెళ్ళే వరకు రాష్ట్రంవైపు తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు కన్నెత్తి చూడలేదని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు . ఇక వరద ముంపు  ప్రాంతం లో పరామర్శ పేరుతో ప్రభుత్వంపై అసత్యాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.  ఇవి కృత్రిమైన వరదలు అంట , ఆయన ఇల్లు ముంచాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకుంటూ  చంద్రబాబు సింపతీ పొందే ప్రయత్నాన్ని చేస్తున్నారని అన్నారు . వరదలను కూడా రాజకీయ లబ్దికోసం చేయడం మంచిదికాదని అంబటి రాంబాబు అన్నారు . గొంగట్లో తింటూ వెంట్రుకలు  వచ్చాయన్నట్లుగా .. వరద ముంపు ప్రాంతం లోని  అక్రమకట్టడమైన ఇంట్లో ఉంటూ తన ఇంటిని వరదలో ముంచాలని ప్రభుత్వం చూసిందని చంద్రబాబు ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు .


రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు .  చంద్రబాబు డ్రోన్ డ్రామాలు ఆపాలని సూచించారు . మాజీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా నదీ పరివాహక ప్రాంతం లో ఉన్న అక్రమకట్టడాలను కూలుస్తామని చెప్పేలేదా ? అని ప్రశ్నించారు . ఆ అక్రమ కట్టడాలకు అప్పట్లో నోటీసులు ఇవ్వలేదా అని నిలదీశారు . ఈ రోజు అదే అక్రమ కట్టడంలో చంద్రబాబు నివాసం ఉండటంలేదా అంటూ , అలాంటి అక్రమ కట్టడంలోనే అధికారిక నివాసం ఏర్పాటు చేసుకోవడం వెనుక .. మీరు గడ్డి తిన్నారు అనేది అర్దమవుతుందని రాంబాబు చెప్పారు . మంత్రి  బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పు ఏముందని ప్రశ్నించారు . శివరామకృష్ణ కమిషన్  ఇచ్చిన నివేదిక వ్యాఖ్యలనే ఉదహరించారని పేర్కొన్నారు . 


 అమరావతి నిర్మాణం అపుతామని చెప్పలేదని ,  తమ ఎన్నికల మ్యానిఫెస్టోని లో తాము  చాలా క్లియర్ గా చెప్పామన్నారు . అమరావతిపై మాకు స్పష్టమైన వైఖరి ఉందన్నారు . పోలవరం,అమరావతి పేరుతో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని అన్నారు . బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి టెలికాస్ట్ చేశారని మండిపడ్డారు . అమెరికాలో సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన చేయలేదని మతం రంగు పులిమి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు . వాస్తవం తెలుసుకోకుండా సీఎంగారి పై ఆరోపణలు  చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు . అమెరికాలో అగ్గి వెలిగించడం నేరమని , వాస్తవాలు తెలుసుకోకుండా బిజేపి పార్టీ నేతలు మాట్లాడటం శోచనీయమన్నారు .

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: