Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 6:30 am IST

Menu &Sections

Search

కోడెల భవనాల ... మజాకా

కోడెల భవనాల ... మజాకా
కోడెల భవనాల ... మజాకా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అక్రమాలు రోజుకొకటి బయట పడుతున్నాయి. ఇప్పటికే గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ‘కోడెల టాక్స్‌’ వసూలు చేశారు. ఇక తన భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకివ్వడంలోనూ కోడెల మార్కు హస్తలాఘవం ప్రదర్శించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి . ప్రభుత్వం తన భవనానికి ఎంత అద్దె చెల్లించాలో స్పీకర్‌గా ఉన్న ఆయనే నిర్ణయించినట్లు తెలుస్తోంది . వైద్య ఆరోగ్యశాఖలోని కీలక కార్యాలయాలన్నీ గుంటూరులోని కోడెల భవనానికి గత ప్రభుత్వ హయాం లో  తరలించారు. ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ చదరపు అడుగుకు 16 రూపాయలు చెల్లిస్తుండగా, కోడెల భవనానికి మాత్రం 25 రూపాయల కంటే ఎక్కువగా చెల్లిస్తున్నారు.


 ఇరుకు గదులు, ఫైర్‌ సేఫ్టీ కూడా లేకపోయినా కోడెల భవనానికి ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లిస్తున్నారు.  వైద్య ఆరోగ్యశాఖలో కీలకమైన కార్యాలయాలుగా గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ఔషధ నియంత్రణ శాఖ, ఫార్మసీ కౌన్సిల్, ఉద్యోగుల వైద్యపథకం వంటివన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. తొలుత వీటిని విజయవాడ పరిసరా  ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇంతలోనే అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తన భవనం గుంటూరులో ఉందని, దాన్ని అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు అంగీకరించారు. దీంతో ఆ విభాగాలు గుంటూరులోని చుట్టుగుంట ప్రాంతానికి తరలించారు. ఉద్యోగులు, పెన్షనర్లు తమ మెడికల్‌ రీయింబర్స్‌మెంటు రాకపోయినా, ఆరోగ్యశ్రీ బాధితులు తమకు అనుమతులు రాలేదని అధికారులను కలవాలన్నా గుంటూరుకు వెళ్లాల్సిందే.


ప్రతి చిన్న అవసరానికీ అక్కడకు వెళ్లాలంటే బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చినా స్పీకర్‌ భవనం కదా అని అధికారులు కూడా పట్టించుకోలేదు. ఎక్కడైనా భవనానికి మాత్రమే అద్దె వసూలు చేస్తారు, కానీ కోడెల శివప్రసాదరావు మాత్రం ఖాళీ స్థలానికి కూడా అద్దె తీసుకుని ప్రభుత్వానికి టోకరా వేశారు. ఐదు అంతస్తుల భవనం టెర్రస్‌పై పల్చటి రేకులు వేసి, ఎలాంటి కార్యాలయం లేకపోయినా దానికి కూడా ప్రభుత్వం నుంచి అద్దె వసూలు చేస్తున్నారు. సుమారు 6 వేల చదరపు అడుగుల ఖాళీ స్థలానికి ఒక్కో చదరపు అడుగుకు 25 రూపాయలు చొప్పున రూ. 1.5 లక్షలు వసూలు చేస్తున్నారు. భవనానికి సరైన పార్కింగ్‌ కూడా లేదు. ఇలాంటి భవనానికి నెలకు రూ. 15 లక్షలకుపైనే గత ప్రభుత్వం ‘కోడెల’ ఖాతాలో వేసింది. ఇప్పటికైనా ఈ కార్యాలయాలను అందరికీ అందుబాటులో ఉండేలా విజయవాడకు సమీపంలో ఏర్పాటు చేయాలని ప్రజానీకం కోరుతోంది. 

 


kodela-shivaprasad-rao
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
44 లక్షల ఎకరాలకు సాగు నీరు ఎలా ఇస్తావో చెప్పు కేసీఆర్
మరోసారి అపరేషన్ ఆకర్ష్ ... టార్గెట్ ఆ ఇద్దరు ఎమ్మెల్యే లేనా ?
కనుపాపే ఆ చిన్నారిని కాటేసింది ...
చేతబడి చేశాడంటూ యువకుడి సజీవ దహనం
వైకాపా లో చేరినా తోట త్రిమూర్తులు తనకు శత్రువే ...
కేసీఆర్ సర్కార్ కు వరుసగా కోర్టు మొట్టికాయలు
విజయ్ దేవరకొండ తో అధికార టీఆరెస్ మాట్లాడిస్తోందా ?
పవన్ స్థాయి ఏమిటీ ... కాంగ్రెస్ నేతలను నిలదీసిన కుంతియా
దక్షిణాదిలో హిందీ భాష అమలుకు తమిళ ప్రజలు అంగీకరించరు
ప్రేమలో పడాలని ఉంది ... కానీ పిల్లలు వద్దు
కోడెలను కేసుల పేరిట సర్కార్ వేధించిందన్న ప్రశ్న తలెత్తే ఛాన్సే లేదు ...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ పోటీ ?
అందరూ అభినవ దృతరాష్టులే ... అందుకు కోడెల మినహాయింపేమీ కాదు
దొంగతనం ఎవరు చేయమన్నారు? ....ఎవరు చనిపోమన్నారు ??
కోటప్పకొండ అభివృద్ధి లో కోడెల పాత్ర కీలకం
కేసీఆర్ లో ఆ దూకుడేది ?...
అమ్మకు అన్నం పెట్టాక... పిన్నమ్మ కు గొలుసు చేయించండి
ఆదివారమే బోట్ ప్రమాదాలెక్కువ ... లైఫ్ జాకెట్లు ఇవ్వడం లో నిర్లక్ష్యం
సేవ్ నల్లమల ఉద్యమం ... వెనక్కి తగ్గిన టీఆరెస్ సర్కార్
వాల్మీకి హిట్ కావడం ఖాయం ... ఎందుకంటే ?
నాడు సేవ్ నల్లమల అన్న గొంతు - నేడు ఎందుకు మూగబోయింది
రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోగం ... భేష్ అంటున్న వాహనదారులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.