పోస్టల్ శాఖలో తీవ్ర కలకలానికి గురిచేసినా వాటర్ బాటిళ్ల కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ పోస్టాఫీస్ లో వీఐపీల పార్సిల్ బాటిళ్ల కలకలం మిస్టరీ వీడింది. బాటిళ్లలో ఎలాంటి రసాయనాలూ లేవని మురుగు నీరు మాత్రమే ఉందని ఎస్ యస్ ఎల్ ప్రాథమిక నివేదిక తేల్చింది. పార్సిల్ బాటిళ్లతో పాటుసి ఒక లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఆ లేఖలో విద్యరులు ఓయూలో మురుగు నీటినే తాగుతున్నారని రాశారు. కేసీఆర్ పేరిట అజ్ఞాత వ్యక్తులు ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నెల పదిహెడున విఐపిల పేర్లతో అరవై రెండు కార్టన్ బాక్స్ లను బుక్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు డీజీపీ మహేందర్ రెడ్డి, చిరంజీవి, వెంకటేష్ ప్రముఖుల పేర్లతో ఈ పార్సిల్ లను బుక్ చేశారు.


మహంకాళి పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ రామచంద్రం,కాంచన రెడ్డి, విఠల్ వీళ్ల పేర్లు మీద ఫ్రమ్ అడ్రెస్ పేర్లతో ఈ బాటిల్స్ వచ్చినట్లుగా గుర్తించారు. మొత్తం ఏదైతే అరవై రెండు వాటర్ బాటిళ్లను రెండు లీటర్ల థమ్సప్ బాటిళ్లలో జాగ్రత్తగా వాటర్ మొత్తం నింపిన తర్వాత వాటిని షూ బాక్స్ లోపల బాటిల్స్ ను ఉంచి దాన్ని ప్యాక్ చేసి దానిపైనా ఆ మొత్తం అడ్రసులు కూడా అతికించారు. దాంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్, కవిత ,హరీశ్ రావు తరవాత డీజీపీ మహేందర్ రెడ్డి తో పాటు హీరో వెంకటేష్, నాగార్జున,చిరంజీవి తదితరుల పేర్లు కూడా చాలా మందికి పంపారు.  ఇవన్నిటిని కూడా ఆ రోజు ఒక అజ్ఞాత వ్యక్తి తీసుకువచ్చి సాధారణంగా యూనివర్సిటీ వాళ్ళు ఇలా అనేక మంది కూడా పోస్టల్ పార్సల్ చేస్తుంటారు అదే క్రమంలో ఒక వ్యక్తి వచ్చి యూనివర్సిటీ నుంచి వచ్చాను మొత్తం అరవై రెండు మందికి బల్క్ పార్సల్స్ పంపాలని చెప్పటం తోటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఆ పార్సల్ ఐటమ్స్ ను తీసుకుని పోస్టాఫీసులో పెట్టటం జరిగింది. అయితే ఆ రోజు రాత్రి శనివారం ఆలస్యం కావటంతో బాటిల్స్ ను ఇక్కడే పెట్టి రేపు ఉదయం వచ్చి అడ్రస్లు, అమౌంట్ చెల్లించాలని చెప్పటం తోటి ఆ మనిషి మరుసటి రోజు వచ్చి ఏడు వేల రెండు వందల పదహారు రూపాయలు మొత్తం బరువుకు తగ్గట్టుగా అమౌంట్ చెల్లించి  పార్సల్స్ బుక్ చేసి వెళ్లిపోయాడు అని చెప్పి అధికారుల వెల్లడిస్తున్నారు.


ఆదివారం రోజు కొరియర్ పంపే క్రమంలో డిస్పాచింగ్ సోషల్ లోకెళ్లిన తరవాత కొద్దిగా ఆలస్యం కావటంతోటి ఒక బాటిల్ నుంచి వాసన వచ్చింది. వాసన వచ్చిన వెంటనే ఆధికారులు ఇక్కడ పోస్టల్ శాఖ సిబ్బంది అప్రమత్తమై విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు తర్వాత క్లూస్ టీం వచ్చిన తర్వాత ఆ బాటిల్స్ ను తెరచి దీంట్లో ఏమైన రసాయన పదార్థాలు ఉన్నాయా లేకపోతే ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అని చెప్పేసి వెంటనే తనిఖీలు చేశారు. వాటిని మొత్తం పూర్తిగా పరిశీలించారు. వెంటనే ప్రాథమిక దర్యాప్తు తర్వాత వాటిని ఎఫ్ఎస్ఎల్ కు పూర్తి స్థాయి పరిశీలనకై పంపారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా కేసులో ఈ పార్సల్స్ ఎవరు తీసుకువచ్చారు దీనికి సంబంధించి యూనివర్సిటీలో ఏం జరుగుతోందన్నది దాదాపు మూడు బృందాలైతే దర్యాప్తులో ఉన్నాయి. మొత్తానికి ఈ గందరగోళానికి కారణం యూనివర్సిటీనే  ప్రధాన కేంద్రంగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే యూనివర్సిటీలో రిజిస్టర్ పుస్తకంను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో  నమోదైన అరవై రెండు మంది పేర్ల జాబితా కూడా అక్కడ ఉండటం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తోంది. మొత్తం మీద ఈ కేసును ఈ రోజు సాయంత్రానికి పోలీసులు ఒక కొలిక్కి తెచ్చి దీనికి సంబంధించిన వారిని అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: