తేనె తుట్టె మీద రాయి వేస్తే ఎంతటి ప్రమాదమో అనుభవించిన వారికి కానీ తెలియదు. వెంటాడి మరీ తేనెటీగలు కాటేస్తాయి. అందుకే దాన్ని అలాగే ఉండనీయాలి. ఇక కొన్ని అంశాలు కూడా అలాంటివే. వాటిని కదపాలని చూస్తే కాటువేస్తాయి. పట్టుకుందామంటే పగపడతాయి. అందుకే వాటిని వీలైనంత వరకూ అలా వదిలేయడమే బెటరేమో.


ఇక ఏపీకి రాజధాని ఎక్కడ అని 2013, 2014 టైంలో చర్చకు వచ్చినపుడు ఏపీలోని మొత్తం జిల్లాలను వల్లించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఓ దశలో రాజమహేంద్రవరం కూడా రాజధాని కావాలని కోరిన వారూ ఉన్నారు. అంటే రాజధాని ఎక్కడ పెడితే అక్కడ అభివ్రుధ్ధి జరుగుతుందన్న పాతకాలం నాటి ఆశలే ఇలా డిమాండ్లు చేయనిస్తున్నాయనుకోవాలి.


చంద్రబాబు సైతం రాజధాని విషయంలో ఎన్నో ట్విస్టులు ఇచ్చి చివరికి తాను అనుకున్న అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అయిదేళ్ళల్లో బాబు అక్కడ పెద్దగా ఏమీ చేయలేకపోయారు. దాంతో ఇపుడు అధికారంలోకి వచ్చిన జగన్ రాజధాని మార్చడానికి పూనుకున్నారన్న వార్తలు ఏపీలో రచ్చ చేస్తున్నాయి. మంత్రి బొత్స అన్న మాటలు ఇపుడు రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి.


రాజధానిని అమరావతి నుంచి మారిస్తే జనం కొడతారని మాజీ స్పీకర్ కొడెల శివప్రసాద్ అంటూంటే, తాను అడ్డం పడైనా అమారావతిని కాపాడుకుంటానని చంద్రబాబు అంటున్నారు. రాజధాని అన్నది రాష్త్ర ప్రభుత్వ పరిధిలోని అంశం, మాకు సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. మొత్తానికి అందరూ రాజధాని గురించే ఈ రోజు మాట్లాడుతున్నారు.


ఇక రాజధాని మార్పు ఖాయమని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ బాంబే పేల్చేరు. దోమకొండ వద్ద రాజధాని మార్పు కోసం జగన్ కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారని కూడా ఆయన గుట్టు విప్పేశారు. అయితే  దోనకొండ కంటే రాజధానికి తిరుపతి అనువైన ప్రాంతమని చింతా మోహన్ అంటున్నారు. అక్కడ రాజధాని పెడితే చాలా బాగుంటుందని ఆయన సూచిస్తున్నారు.
ఇక కర్నూల్లో రాజధాని పెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే కాటసాని  రాం భూపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.


ఆంధ్ర  రాష్ట్రంగా మద్రాస్ నుంచి విడిపోయి ఏర్పడిన కొత్తల్లో కర్నూలే రాజధాని అని ఆయన గుర్తు చేశారు. ఆ ప్రకారం కర్నూల్లో  పెట్టాల్సిందేనని ఆయన అంటున్నారు. ఈ విషయమై తాను జగన్ని కలిసి విన్నవిస్తానని కూడా అంటున్నారు. ఇక విశాఖపట్నంలో రాజధాని పెట్టాలని కూడా డిమాండ్ మళ్ళీ వస్తొంది. ఏపీలో పెద్ద నగరంగా ఉన్న విశాఖను రాజధాని చేస్తే శరవేగంగా అభివ్రుధ్ధి సాగుతుందని స్థానిక మేధావులు, ఉత్తరాధ్ర ప్రముఖులు అంటున్నారు. మొత్తం మీద అమరారవి కాకపోతే ఎన్నో సిటీలు ఇపుడు రాజధాని కోరుతున్నాయి. మరి జగన్ మాటెమిటో.


మరింత సమాచారం తెలుసుకోండి: