Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 24, 2019 | Last Updated 2:08 pm IST

Menu &Sections

Search

హవ్వ ... నడ్డా ఎవరో తెలియదంటావా ?

హవ్వ ...  నడ్డా ఎవరో తెలియదంటావా ?
హవ్వ ... నడ్డా ఎవరో తెలియదంటావా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జాతీయ జనతా పార్టీ (బీజేపీ ) కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తెలియదంటూ  టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి . నడ్డాను కించపర్చే విధంగా  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు సీరియస్ గా తీసుకుంటున్నారు. నడ్డా  ఎవరో తెలియదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా ద్వారా ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు .  కేంద్ర విద్య ఆరోగ్య శాఖ మంత్రిగా గతం లో నడ్డా వ్యవహరించిన విషయం తెల్సిందే . రాష్ట్రానికి రావాల్సిన నిధులు , సంస్థల ఏర్పాటు గురించి గతం లో కేటీఆర్ మంత్రి హోదా లో నడ్డాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు .


  తాజాగా కేటీఆర్ వ్యాఖ్యల నేపధ్యం లో  జేపీ నడ్డా ను గతం లో  కేటీఆర్ కలిసిన ఫోటోలను వీడియోలను బీజేపీ సానుభూతిపరులు  సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో,  వైరల్ గా మారుతున్నాయి.  జేపీ నడ్డా ఎవరో  తెలియదన్న కేటీఆర్ ఆయన్ని గతం లో  ఎలా కలిశారంటూ  ప్రశ్నిస్తున్నారు.  నడ్డా ఎవరో తనకు తెలియని తెలియదంటున్న పెద్ద మనిషి గతం లో ఆయన్ని కలిసి రాష్ట్రానికి ఫార్మా సిటీ కేటాయించాలని  విన్నవించానని ఎందుకు మీడియా  చెప్పారో సమాధానం ఇవ్వాలని  డిమాండ్ చేస్తున్నారు .  దీంతో  జేపీ నడ్డా ఎవరో తనకు తెలియదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు  బూమరాంగ్ అయినట్టు కనిపిస్తున్నాయి.


  కేటీఆర్ ఇప్పటికైనా తన అహంకారాన్ని తగ్గించుకుంటే మంచిదని  బిజెపి నాయకుడు రఘునందన్ రావు సూచించారు.  కేటీఆర్ అహంకారం వల్లే ఆయన సోదరి కవితా నిజాంబాద్ లో ఓడిపోయారని, ఇక ముఖ్యమంత్రి  కెసిఆర్ అహంకారం వల్ల తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ కరీంనగర్ లో  టిఆర్ఎస్ పార్టీ మట్టికరిచిందని అయన అన్నారు .   ఇతరులకు మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం కేటీఆర్ నేర్చుకోవాలని ,  లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అయన హెచ్చరించారు


ktr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వీళ్ళు మారరప్పా : సీఎస్సార్ వద్దు, కమిషన్లే ముద్దు ...ఇదీ ఎస్వీయూ పద్దు
చట్టం ఏమైనా వారికి చుట్టమా ... కేసు ఎందుకు నమోదు చేయలేదు ?
లింగమనేని గెస్ట్ హౌస్ కూల్చివేత ఖాయం : ఇప్పుడిక బాబు ఎం చేస్తారో ?
ప్రాణాలు తీస్తోన్న టిక్ టాక్ సరదా ...
పోలవరం ప్రాజెక్ట్ పనులకు ఒకే ఒక బిడ్ : ఆ సంస్థకే పనుల అప్పగింత ?
నిరుద్యోగుల్లో అనుమానం కలిగించడమే ఆ పత్రిక లక్ష్యం
హవ్వ ... అదేమిటి రామ్ చరణ్ ? అంత పని చేశావా ??
వారం రోజుల్లో ఖాళీ చేయాల్సిందే .. లేకుంటే తదుపరి చర్యలు
బీజేపీ లో ఆది చేరిక ను అడ్డుకుంటున్నది ఆయనేనా ?
అనవసర విషయం లో జోక్యం .. అభాసుపాలయిన ఎంపీ
వైకాపా వల్లే కోడెల శివరాం కు పార్టీ లో కీలక పదవి ...?
ఒంటరి అవుతోన్న చంద్రబాబు ...?
రేవంత్ అత్యుత్సాహం ... మళ్ళీ బహిర్గతమైన కాంగ్రెస్ కుమ్ములాటలు
44 లక్షల ఎకరాలకు సాగు నీరు ఎలా ఇస్తావో చెప్పు కేసీఆర్
మరోసారి అపరేషన్ ఆకర్ష్ ... టార్గెట్ ఆ ఇద్దరు ఎమ్మెల్యే లేనా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.