గత కొన్ని రోజులుగా స్థానిక, జాతీయ మీడియాలో ఓ మాట విపరీతంగా వినిపిస్తోంది. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిని చేయబోతున్నారు. రాజధానిని చేస్తే... ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉన్నది అనే వాదన వినిపిస్తోంది.  ఈ వాదన వెనుక ఎంత అర్ధం ఉన్నదో తెలియదుగాని, వాదన మాత్రం వినిపిస్తూనే ఉన్నది.  ఇదిలా ఉంటె, ఇప్పుడు దీనిపై మరింత సమగ్రంగా కొందరు చర్చిస్తున్నారు.  


హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయడం వలన చాలా లాభాలు ఉన్నాయి.  ఇక్కడ రక్షణ వ్యవస్థ పటిష్టం అవుతుంది.  ఫలితంగా క్రైమ్ రేట్ తగ్గే అవకాశం ఉంటుంది.  అంతేకాదు, రెండో రాజధానిని చేస్తే.. ఇక్కడ ఒక పార్లమెంట్ వ్యవస్థ ఉండాలి, సుప్రీం కోర్ట్ బెంచ్ ఉండాలి.. అలానే కేంద్రప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల నిర్వహణకు సంబంధించిన బిల్డింగ్ లు ఇక్కడ నెలకొల్పాలి.  


దీని వలన ఉద్యోగాల కల్పన జరుగుతుంది.  వేలాదిమందికి ఉద్యోగాలు వస్తాయి.  రాజధాని నగరం కాబట్టి రోడ్లు ఇప్పటిలా గుంతలు ఉండవు.  ప్రోటోకాల్ వ్యవస్థ ఉంటుంది.  నగరంలో అలజడులు వంటివి చోటుచేసుకునే అవకాశం తక్కువ.  పనుల నిమిత్తం నగరానికి వస్తుంటారు కాబట్టి.. నగరానికి ఆదాయ మార్గాలు కనిపిస్తాయి.  


కేవలం ఇవే కాదు విద్య, ఆరోగ్యం వంటి వాటి విషయంలో కూడా కేంద్రం శ్రద్ద వహించే అవకాశం ఉంటుంది.  ఫలితంగా హైదరాబాద్ నగరం ప్రపంచపటంలో ఓ స్థాయిలో నిలబడుతుంది.  అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంటుంది.  అంతటా అభివృద్ధి కనిపిస్తుంది. 

హైదరాబాద్ రెండో రాజధాని చేయడం ప్రజలకు వచ్చే నష్టాలు చాలా తక్కువ. కాకపోతే రాజకీయంగా నాయకులకు ఇది నచ్చదు.  ఎందుకంటే.. రక్షణ వ్యవస్థ కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది కాబట్టి వారి పవర్ తగ్గిపోయినట్టు అవుతుంది.  అందుకే రెండో రాజధాని విషయాన్ని పక్కన పెడుతున్నారు.  కేంద్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే.. ఈజీగా చేసేయ్యొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: